బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
Heavy Rain Alerts: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

Weather Report: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఒడిశా-ఉత్తరాంధ్ర తీరం వెంబడి కేంద్రీకృతమైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మంగళవారం వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని.. సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో బలమైన గాలులుతోపాటు వానలు పడే సూచనలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story