కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్లాస్మా డొనేషన్‌‌‌కు భారీ డిమాండ్

కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్లాస్మా డొనేషన్‌‌‌కు భారీ డిమాండ్
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్లాస్మా డొనేషన్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇదే ఆసరాగా కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.

ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్లాస్మా డొనేషన్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇదే ఆసరాగా కార్పొరేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. విశాఖలోనే ప్రతిరోజూ 500కి పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు 574 కి చేరాయి. ఇప్పటివరకూ విశాఖలో 64,890 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

దీంతో వీరి రక్తంలోని ప్లాస్మాలో యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. అయితే మొన్నటి దాకా ప్లాస్మా డొనేషన్ పై పెద్ద అవగాహన లేకపోవడంతో ఎవరు ముందుకు రాలేదు. ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో ప్లాస్మా డొనేషన్ పై అవగాహన పెరిగింది. ఇదే అదునుగా భావించిన కార్పొరేట్ ఆసుపత్రులు ప్రకనలతో ఊరిస్తున్నాయి.

ప్లాస్మాను ఉదారంగా లేదా నామమాత్ర రుసుముతో దానమివ్వాల్సిన పరిస్ధితి నుంచి వ్యాపారంగా మార్చేసే ధోరణి ఏర్పడుతోంది. ఆ పరిస్ధితి రాకుండా ఉండాలంటే అధికారులు ముందే మేలుకోవాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతోంది. ఇదిలా వుంటే ప్రభుత్వమే నేరుగారెడ్ క్రాస్ వంటి సంస్ధలతో ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ విజ్ఞప్తి చేస్తున్నారు. అనధకారికంగా కార్పొరేట్ ఆసుపత్రులు గాని, బ్లడ్ బ్యాంకులు గానీ అధిక డబ్బులు ప్లాస్మా కోసం వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను జయించిన వారిలో ఎంత మంది తమ రక్తాన్ని దానంగా ఇవ్వగలరనేది కూడా అనుమానమే. మహమ్మారి తన స్వరూపాన్ని మార్చుకుంటుండడంతో ప్లాస్మా ఇవ్వడానికి భయపడే పరిస్థితి నెలకొంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్లాస్మా డొనేషన్ పై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బ్లడ్ బ్యాంక్ రిటైర్డ్ డైరెక్టర్ రామారావు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story