ఆంధ్రప్రదేశ్

YS Jagan : హైదరాబాద్ సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన జగన్..!

YS Jagan : హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఎపీ సీఎం జగన్ తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.

YS Jagan : హైదరాబాద్ సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన జగన్..!
X

YS Jagan : హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఎపీ సీఎం జగన్ తరపున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేసిన నేపథ్యంలో.. దీనికి 98 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పటికే కోర్టు పలు వాయిదాలు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించడంతో సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించారు.

తానెక్కడ కూడా బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని జగన్ పేర్కొన్నారు. పిటిషనర్ రఘురామకి తన కేసుకు ఎలాంటి సంబంధం లేదని, రఘురామకృష్ణరాజు పిటిషన్ వేసే అర్హత లేదని వివరణ ఇచ్చారు. తాము విచారణకు రాకుండా సహకరించకపోతే సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయాలని, రఘురామకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కూడా కౌంటర్లో జగన్ తరపు అడ్వకేట్లు పేర్కొన్నారు.

అలాగే ఒక కేసు నమోదు అయినప్పుడు దానిపైన కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు మూడో వ్యక్తి కలగ చేసుకోవద్దు అంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను కూడా జగన్ ప్రస్తావించారు. అటు ఈ కేసులో సీబీఐ కూడా మెమో దాఖలు చేసింది మెరిట్స్ డీమెరిట్స్ పరిశీలించి బెయిల్ రద్దు పిటీషన్ పై నిర్ణయం తీసుకోవాలని .. ఆ నిర్ణయాన్ని కోర్టకు వదిలి పెట్టింది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది.

Next Story

RELATED STORIES