లోకేష్ ధాటికి వణుకుతోన్న వైసీపీ సర్కార్

లోకేష్ ధాటికి వణుకుతోన్న వైసీపీ సర్కార్
లోకేష్‌ యువగళం పాదయాత్ర చేపడితే జీఓ నెం. అంటూ ఓ చీకటి జీఓ తెచ్చి నానా హంగామా చేసిన సర్కార్‌ ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ వారాహి యాత్ర మొదలు పెట్టగానే పోలీస్‌ యాక్ట్‌ 30 అంటూ ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమైంది

ప్రతిపక్షాలు రోడ్డెక్కితే చాలు అధికార వైసీపీ సర్కార్ వణుకుతోంది. లోకేష్‌ యువగళం పాదయాత్ర చేపడితే జీఓ నెం. అంటూ ఓ చీకటి జీఓ తెచ్చి నానా హంగామా చేసిన సర్కార్‌ ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ వారాహి యాత్ర మొదలు పెట్టగానే పోలీస్‌ యాక్ట్‌ 30 అంటూ ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమైంది. పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు తేదీ ప్రకటించారు. అంతే వైసీపీకి..వణుకు ప్రారంభమయింది. వెంటనే.. వారాహి తిరిగే రూట్లలో పోలీస్ యాక్ట్ అమలు ప్రకటించేశారు. పోలీసుల తీరు చూసి జనసైనికులే కాదు.. సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ నేతలు యాత్రలు చేసుకోడం ప్రజాస్వామ్య హక్కు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు. ఎన్నికల ముందూ ఇదే తంతు.

అమలాపురం అల్లర్ల కారణంగా ఆరు నెలల పాటు అమలు చేసిన పోలీస్ యాక్ట్ ను రెండు నెలల కిందట ఎత్తేశారు. ఈ సారి ఏమీ జరగకుండానే పవన్ యాత్రకు వస్తున్నారని మళ్లీ రాత్రికి రాత్రి అమలు చేయడం ప్రారంభించారు. తక్షణం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసి పవన్ యాత్ర జరిగే వరకూ అంటే.. నెలాఖరు వరకూ ఉంటుందని ప్రకటించారు. పోలీస్ యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులు వంటివి జరగడానికి వీల్లేదు. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెడతారు.

ఇక 1861 పోలీస్ యాక్ట్లోని సెక్షన్ 30 ప్రకారం జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్లు ఆంక్షలు విధించవచ్చు.ఈ సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో శాంతిభద్రతలను పరిగణలోకి తీసుకుని బహిరంగ సభలు. ర్యాలీలకు అనుమతి ఇచ్చే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారులు తమ పరిధిలోని కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా కట్టడి చేయవచ్చు. ఆ కార్యక్రమాలు ఏయే ప్రాంతాల వరకు పరిమితం కావాలన్న దానిపైనా రూట్ మ్యాప్ విడుదల చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.

అయితే సభలు, సమావేశాలు, ర్యాలీల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన సందర్భాల్లోనే సెక్షన్ 30ని పోలీసులు ప్రయోగిస్తారు.నిషేధాజ్ఞలున్న ప్రాంతాల్లో డీజే సౌండ్స్ తో ఊరేగింపులపైనా బ్యాన్ ఉంటుంది. వీటిని ఉల్లంఘించే వారిపై మెట్రోపాలిటన్ సిటీ పోలీస్ యాక్ట్ లోని 2016 ఐపీసీ 188, యూ/ఎస్76 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు.అయితే తమ ప్రజాస్వామ్య హక్కును ఇలా అడ్డుకుంటామంటే చూస్తూనే ఊరుకునేది లేదని..ప్రతిపక్షాలు అంటున్నాయి. జీఓ నెం1 విషయంలో ప్రభుత్వానికి కోర్టుల్లో జరిగిన అవమానమే పోలీస్‌ యాక్ట్‌ 30 విషయంలో జరగనుందని అంటున్నారు. ప్రతిపక్షాల సభలపై ఎన్ని ఆటంకాలు సృష్టించినా వెనక్కి తగ్గబోమంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story