Lokesh: జగన్ పాలనను గాలికి వదిలేశారు..: నారా లోకేశ్

Lokesh: జగన్ పాలనను గాలికి వదిలేశారు..: నారా లోకేశ్
పిఠాపురంలో లోకేశ్‌ యువగళం పాదయాత్ర

ఏపీలో సీఎం జగన్ పాలనను గాలికి వదిలేశారని టీడీపీ నేత నారా లోకేశ్ ధ్వజమెత్తారు.ప్రజాధనం దోచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు కట్టలేదన్న నారా లోకేశ్ ఉన్నవాటిని కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సీఎం జగన్ పాలనపై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేశాడని ఎద్దేవా చేశారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు. కొత్త ప్రాజెక్టులు నిర్మించక పోగా, ఉన్న వాటి నిర్వహణని పట్టించుకోలేదని విమర్శించారు.

ఈ మేరకు శనివారం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందన్నారు. గతేడాది గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయిందని తెలిపారు. నీరు వృథాగా పోతోందని తెలిపారు. మరోవైపు నారా లోకేష్ యువగళం పాదయాత్ర కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అడుగు పెట్టింది. 217వ రోజు పాదయాత్ర 2,974 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా సందర్భంగా లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. చంద్రబాబు విడులయ్యాక లోకేష్ తిరిగి యువగళం పాదయాత్రను చేపట్టారు.

మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అందరు కలిసి..కష్టపడి పనిచేయాలని సూచించారు. పనిచేసినవారిక తగిన గుర్తింపు ఉంటుందని..గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తానని..పనితీరు బాగా లేకపోతే పక్కనపెట్టేస్తానని స్పష్టంచేశారు.

రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం అవసరం ఎంతో ఉందన్నారు. కాబట్టి నాయకులంతా కష్టపడి పనిచేయాలని.. పనితీరు ఏమాత్రం బాగోకపోతే ఏమాత్రం ఉపేక్షించేంది లేదని వార్నిగ్ ఇచ్చారు. పనితీరు విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కానని తేల్చి చెప్పారు. తాను అంతర్గతంగా సర్వేలు చేయిస్తున్నానని ఆ సర్వేల్లో ఎవ్వరి పనితీరు బాగోకపోయినా ప్రత్యామ్నాయo చూపించి పక్కన పెడతానని అటువంటివారిని ఏమాత్రం ఉపేక్షించేదిలేదని తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేసేవారిని ఎలా గుర్తు పెట్టుకుంటానో పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టేందుకు సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story