AP: ఏపీలో నామినేషన్ల సందడి

AP: ఏపీలో నామినేషన్ల సందడి
భారీ ర్యాలీలతో నామపత్రాలు దాఖలు చేసిన నేతలు... గుడివాడలో స్వల్ప ఉద్రికత

అభ్యర్థుల నామినేషన్లతో ఆంధ్రప్రదేశ్‌ సందడిగా మారింది. కార్యకర్తలు, శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి... అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. వైసీపీ నేతల ర్యాలీలు పలుచోట్ల ప్రజలకు అవస్థలు తెచ్చిపెట్టాయి. గుడివాడ అసెంబ్లీ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ వ్యవహారం స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. నామినేషన్‌కు ర్యాలీగా వెళ్తున్న వెనిగండ్లకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఏలూరు రోడ్డు బొమ్మరిల్లు థియేటర్ వద్ద ర్యాలీని అడ్డగించి....,లీలామహల్ సెంటర్ మీదుగా వెళ్లాలన్నారు. ముందస్తుగా రూట్‌ మ్యాప్‌ సమర్పించినా అడ్డుకోవడమేంటని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతల ప్రతిఘటనతో వెనక్కి తగ్గిన పోలీసులు... చివరికి అనుమతించారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నితో కలిసి... ర్యాలీగా వెళ్లి వెనిగండ్ల నామపత్రాలు సమర్పించారు.


పల్నాడు జిల్లా చిలకలూరిపేట కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావు నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు, అభిమానులతో కలిసి... భారీ ర్యాలీగా వెళ్లి... నామపత్రాలు సమర్పించారు. బాపట్ల అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా వేగేశ్న నరేంద్ర వర్మ నామినేషన్‌ దాఖలు చేశారు. అల్లూరు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.... కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి... నామపత్రాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా కందుకూరు కూటమి అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్‌ వేశారు. తెలుగుదేశం కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి... నామపత్రాలు సమర్పించారు. నెల్లూరు అర్బన్‌ సీపీఎం అభ్యర్థిగా మూలం రమేష్‌ నామినేషన్‌ వేశారు.

తిరుపతి అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు నామినేషన్‌ దాఖలు చేశారు. SV తారకరామ స్టేడియం నుంచి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి..... నామపత్రాలు సమర్పించారు. హిందూపురం లోక్‌సభ కూటమి అభ్యర్థి బీకే పార్థసారధి.... ర్యాలీగా వెళ్లి.... కలెక్టరేట్‌లో నామినేషన్ వేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి కూటమి అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. వైకాపా అభ్యర్థిగా మక్బూల్‌ అహ్మద్‌, కాంగ్రెస్‌ తరఫున షాన్‌ వాజ్‌, స్వతంత్ర అభ్యర్థిగా పాలకొండమ నాయుడు నామపత్రాలు సమర్పించారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు వైకాపా అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాసులు నామినేషన్‌ వేశారు. YSR జిల్లా కమలాపురం కూటమి అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి... కుటుంబసభ్యులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు.

ఏలూరు జిల్లా కైకలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ నామినేషన్ వేశారు. కేంద్ర మత్స్యశాఖ మంత్రి మురుగన్, తెదేపా మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావుతో కలిసి ఎన్నికల అధికారికి నామపత్రాలు అందజేశారు. చింతలపూడి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎలీజా నామినేషన్‌ వేశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ కార్యకర్తలతో కలిసి... భారీ ర్యాలీగా వెళ్లి... నామినేషన్‌ దాఖలు చేశారు. ముమ్మిడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ వేశారు.

Tags

Read MoreRead Less
Next Story