వైకేపీ అధికారుల నిర్భందం..తాళాలు వేసి మహిళల ఆందోళన

వైకేపీ అధికారుల నిర్భందం..తాళాలు వేసి మహిళల ఆందోళన
తమకు న్యాయం జరగదని భావించిన మహిళలు అధికారులను లోపల నిర్బంధించి వైకేపీ కార్యాలయానికి తాళం వేశారు.

అనంతపురం జిల్లా యాడికిలో వైకేపీ కార్యాలయానికి మహిళలు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. ఎస్సీ సబ్ ప్లాన్ రుణాలను కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డ్వాక్రా మహిళలు అధికారులను నిర్భందించారు. యాడికి మండలం నగరూరుకు చెందిన మహిళా సంఘాల్లోని 17 మంది సభ్యుల పేరిట 2015లో రూ.4.55 లక్షల రుణం మంజూరైంది. ఈ రుణాన్నిCC రమేష్, VOA బాలమునయ్య, కొందరు APM లు కాజేశారని మహిళలు ఆరోపించారు. ఆ రుణాలను తిరిగి చెల్లించాలని బ్యాంక్ అధికారులు మహిళలకు నోటీసులు పంపించారు. రుణాలను చెల్లించే వరకు ఇతర పథకాల లబ్ధి చేకూరకుండా నిలిపివేశారు. నోటీసులు వచ్చాకగాని మహిళలకు తమ పేరిట రుణం కాజేసిన విషయం తెలియరాలేదు. దీనిపై వారం క్రితం యాడికి పోలీసుకు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో VOA, అప్పట్లో పనిచేసిన APMలు ఈ సమస్యపై చర్చించేందుకు యాడికి వైకేపీ కార్యాలయానికి వచ్చారు. డ్వాక్రా సంఘాల సభ్యులు, అధికారులకు తీవ్రస్ధాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు న్యాయం జరగదని భావించిన మహిళలు అధికారులను లోపల నిర్బంధించి వైకేపీ కార్యాలయానికి తాళం వేశారు. తమకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story