Avinash Arrest: లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల

Avinash Arrest: లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి అరెస్టుపై లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల చేసింది.అవినాశ్‌ రెడ్డి అరెస్టుపై సీబీఐ సమాచారం ఇస్తూ రాసిన లేఖ సోమవారం తమకు అందినట్లు తెలిపింది.లేఖలో సీబీఐ పేర్కొన్న అంశాలను లోక్‌సభ సచివాలయం బులెటిన్‌లో పేర్కొంది.జూన్‌ 3న అవినాశ్‌ను అరెస్టు చేసి వెంటనే 5 లక్షల పూచీకత్తు, 2 ష్యూరిటీలతో విడుదల చేశామని సీబీఐ సమాచారం ఇచ్చిందని వెల్లడించింది. అరెస్టు చేస్తే వెంటనే బెయిల్‌ ఇవ్వాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకే అవినాశ్‌ను విడుదల చేశామని లేఖలో సీబీఐ పేర్కొన్నట్లు లోక్‌సభ సచివాలయం స్పష్టంచేసింది. మరోవైపు వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడిగా సీబీఐ చేర్చింది.జూన్ 3న అవినాష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు.ఆ తర్వాత వెంటనే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అనుసరించి వెంటనే పూచీకత్తుపై విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story