మహిళపై రెచ్చిపోయిన మంత్రి అనుచరులు

మహిళపై రెచ్చిపోయిన మంత్రి అనుచరులు
మంత్రికి చెందిన బిల్డింగ్ లో బ్యూటీపార్లర్‌ నడుపుతున్న శివ నాగమణి అనే మహిళకు చుక్కలు చూపించిన అనుచరులు

గుంటూరులో మంత్రి అంబటి రాంబాబు అనుచరులు రెచ్చిపోయారు. మంత్రికి చెందిన బిల్డింగ్‌లో బ్యూటీపార్లర్‌ నడుపుతున్న శివ నాగమణి అనే మహిళకు చుక్కలు చూపించారు. నెలకు 90 వేల రూపాయలు అద్దె చెల్లిస్తున్న ఆమెను ‘వెంటనే షాపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని లేదంటే సామాన్లు రోడ్డుపై పడేస్తామని బెదిరించారు. అంతేకాదు రాత్రికి రాత్రే షాపునకు తాళాలు వేశారు. వారం రోజులుగా వ్యాపారం సాగకుండా అడ్డుపడ్డారు. బాధిత మహిళ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

బ్రాడీపేటలో మంత్రి అంబటి రాంబాబుకు బిల్డింగ్‌ ఉంది.అందులోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో శివ నాగమణి నాలుగున్నరేళ్లుగా పింక్స్‌ అండ్‌ బ్లూస్‌ పేరుతో బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తోంది. షాప్‌ తీసుకున్నప్పుడే మూడు నెలల అద్దె అడ్వాన్స్‌ ఇచ్చింది. ఈ మధ్య వ్యాపారంలో ఒడిదొడుకులు రావడంతో అద్దె చెల్లించలేకపోయింది. షాప్‌ ఖాళీ చేయాలంటూ బెదిరించారు మంత్రి అనుచురులు. అంతేకాదు అర్ధరాత్రి 12 గంటలకు షాపునకు తాళాలు వేశారు. అదేమిటని ప్రశ్నిస్తే షాపు ఖాళీ చేసి వెళ్లాల్సిందేనని, లేదంటే సామాన్లు రోడ్డుపై పడేస్తామన్నారని శివ నాగమణి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇప్పటికే కోటి రూపాయలు పెట్టి షాపును మార్పు చేశానని ఉన్నపళంగా వెళ్లిపోమంటే ఆ ఖర్చు ఎవరు భరిస్తారంటోంది శివనాగమణి. తనకు నష్టపరిహారం చెల్లిస్తే తక్షణమే ఖాళీ చేసి వెళ్తానంటోంది బాధిత మహిళ. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story