Kodali Nani : పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని విసుర్లు

Kodali Nani : పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని విసుర్లు
Kodali Nani : ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి బృందం భేటీపై ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు

Kodali Nani : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి బృందం భేటీపై ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. సమావేశంలో అన్నయ్య చిరంజీవి.. జగన్‌ను దండం పెట్టి అడగటాన్ని తప్పుబట్టారు. ఎంత పెద్దస్థాయి వ్యక్తి అయినా జగన్‌ ముందు దేహీ అనాలా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని కౌంటరేశారు. వంగి వంగి నమస్కారాలు అనొచ్చా అని ప్రశ్నించారు. నీ కుటుంబం ఈ స్థాయిలో ఉండటానికి కారణం చిరంజీవి కాదా అని ప్రశ్నించారు. క్యాంప్‌ ఆఫీస్‌లోకి కారు వెళ్లదని.. సీఎం కూడా ఇంటి నుంచి నడుచుకుంటూ క్యాంప్‌ ఆఫీస్‌కి వెళ్తారన్నారు. భీమ్లా నాయక్‌ సినిమాను తొక్కేశారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story