ysrcp: నా తండ్రి వైఎస్సార్ ఆశయసాధన కోసమే.. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల

ysrcp: నా తండ్రి వైఎస్సార్ ఆశయసాధన కోసమే.. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(y s rajashekahar reddy) ఆశయాల కోసమే తాను కాంగ్రెస్(congress) పార్టీలో చేరానని వైఎస్ షర్మిల(y s sharmila) అన్నారు. ఆమె ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇడుపులపాయలోని వైఎస్‌ సమాధి వద్ద నివాళులర్పించారు. ఏపీపీటీసీ(APPTC) అధ్యక్షురాలిగా నియామకం జరిగిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లాకు వచ్చిన షర్మిలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో సీనియర్ నాయకులు శైలజానాథ్, తులసిరెడ్డి, గౌతు, అహ్మదుల్లా తదితరులున్నారు.

అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ ఆశీర్వాదం వల్లే తాను ఇడుపులపాయకు వచ్చానని అన్నారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌కు ఆత్మ అని, ఆ పార్టీ సిద్ధాంతమని షర్మిల అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను కాపాడేందుకు, దేశాన్ని బాగుచేసేందుకే పార్టీలో చేరినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేంత వరకు పోరాడుతామని షర్మిల అన్నారు.

రాహుల్ గాంధీని(rahul gandhi) ప్రధానిగా చేయడం కోసం అందరం కలిసి పనిచేస్తామని మాజీ మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. పేదలకు వైఎస్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని కేవీపీ రామచంద్రరావు అన్నారు. కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్‌కు దిక్సూచిగా పనిచేసి వైఎస్ ఆశయాలను నెరవేర్చి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు షర్మిల కృషి చేశారని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story