Vizag Drugs: వైజాగ్ ను గంజాయి మాయం చేసేశారన్న నారా భువనేశ్వరి

Vizag Drugs: వైజాగ్ ను గంజాయి మాయం చేసేశారన్న నారా భువనేశ్వరి
ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో, ఏమనుకోవాలో అర్థంకావట్లేదని విమర్శ

ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నమే రాజధాని అని అంటూ చివరకు గంజాయికి కాపిటల్ గా మార్చేశారని వైసీపీ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి మండిపడ్డారు. రాజధానిని చేస్తామన్న నేతలు ఇన్నేళ్లయినా ఎక్కడా ఒక్క ఇటుక కూడా వేయలేదేంటా అని మనం అనుకున్నాం. కానీ విశాఖను గంజాయి కాపిటల్ గా ఎప్పుడో మార్చేశారని చెప్పారు. ఈ విషయం మనమే అర్థం చేసుకోలేదన్నారు. రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును ఫణంగా పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో, ఏమనుకోవాలో తెలియట్లేదని వాపోయారు.

విశాఖ డ్రగ్స్ ఘటనపై సీబీఐ లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. విశాఖ తీరానికి బ్రెజిల్‌ నుంచి 25 వేల కిలోల డ్రగ్స్‌ దిగుమతి కావడంతో.. తీవ్ర దుమారం రేగింది. ఇంటర్‌పోల్‌ సమాచారంతో పట్టుకున్న సీబీఐ... సంధ్య ఆక్వా పరిశ్రమలో విస్తృతంగా సోదాలు జరిపింది. సిటీ ఆఫ్ డెస్టినేషన్‌గా ఉన్న విశాఖను... సిటీ ఆఫ్‌ డ్రగ్స్‌గా వైకాపా ప్రభుత్వం మార్చేసిందని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ వ్యవహారంలో అధికార వైకాపాపై ఈసీకి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది..

విశాఖలో 25వేల కిలోల డ్రగ్స్ దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. కంటైనర్ లో 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగుల్లో ఉన్న డ్రైడ్ ఈస్ట్‌ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ పోల్ సమాచారంతో కంటైనర్ కోసం నౌకను సీబీఐ ట్రాక్ చేసింది. విశాఖలో కంటైనర్ దించి... తమిళనాడు కట్టుపల్లి పోర్టుకు నౌక వెళ్లినట్లు సమాచారం. డ్రగ్స్ కంటైనర్ ను విశాఖలో దించినట్లు నౌకా సిబ్బంది ద్వారా సీబీఐ నిర్ధారించింది. దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, కస్టమ్స్ అధికారులు... నౌకలో తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ కంటైనర్... సంధ్య ఆక్వా పరిశ్రమ పేరిట బుక్ అయి ఉండటంతో.. గురువారం రాత్రి కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలోని సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ సోదాలు చేపట్టారు. శుక్రవారం ప్రత్యేక అధికారులతో కలిసి సీబీఐ బృందం మరిన్ని తనిఖీలు చేపట్టింది. ల్యాబ్‌లో నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్‌ అధికారులు... వాటిని విశాఖకు పంపినట్లు సమాచారం. సంధ్య ఆక్వా సంస్థలో 2 రోజుల క్రితమే సీబీఐ సోదాలు చేపట్టి.... పరిశ్రమలోని రికార్డులను స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ కంటైనర్‌ను సీబీఐ అధికారులు.. విశాఖ కంటైనర్ పోర్టులో ఉంచారు. ప్రస్తుతం కస్టమ్స్, సీబీఐ అధికారుల భద్రతలో డ్రగ్స్ కంటైనర్ ఉంది.

ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రాజధానిగా, మత్తుపదార్థాలకు అడ్డాగా జగన్ మార్చారేశారని... తెలుగుదేశం మండిపడింది. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల ప్రధానాధికారి మీనాను తెదేపా నేతలు బొండా ఉమ, వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. భారీగా డ్రగ్స్ తరలించి ఎన్నికల్లో వైకాపా లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పట్టాభి హెచ్చరించారు.

విశాఖలో పట్టుబడిన మాదక దవ్యాల ఘటనలో పురందేశ్వరి, చంద్రబాబు పేరువాడుకుని ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వైకాపా యత్నిస్తోందని.... నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తంచేశారు..


Tags

Read MoreRead Less
Next Story