కోటయ్య మరణించారు..

కోటయ్య మరణించారు..
నెల్లూరు కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఔషధానికి మొదటి ప్రచార కర్త ఆయనే.

ఆనందయ్య మందు తీసుకున్నారు. ఆరోగ్యం బాగానే ఉందన్నారు. కానీ అంతలోనే కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండడంతో నెల్లూరు జిజి హెచ్ లో జాయిన్ అయ్యారు. గత నాలుగు రోజులుగా వెంటి లేటర్ పై చికిత్స పొందుతున్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య కన్నుమూశారు.

నెల్లూరు కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఔషధానికి మొదటి ప్రచార కర్త ఆయనే. ఆయన ద్వారానే ఆనందయ్య మందు దేశానికి తెలిసింది. అప్పటి నుంచి కృష్ణ పట్నానికి కరోనా బాధితులు తండోప తండాలుగా చేరుకుంటున్నారు.

ఆయన మందు వేసుకున్న వెంటనే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయని కూడా చెబుతున్నారు. కోటయ్య కూడా కరోనా బారిన పడి ఆనందయ్య ఇచ్చిన మందుతో కోలుకున్నారు. కానీ మళ్లీ పదిరోజుల క్రితం కరోనా సోకడంతో ఆస్పత్రిలో జాయినై చికిత్స తీసుకుంటున్నారు. కానీ పరిస్థితి విషమించడంతో ఈ రోజు తుది శ్వాస విడిచారు.

Tags

Read MoreRead Less
Next Story