ఏపీలో ఆగని కరోనా విజృంభణ

ఏపీలో ఆగని కరోనా విజృంభణ

ఏపీలో కరోనా విజృంభణకు బ్రేకులు పడడం లేదు. గత వారం నుంచి ప్రతి రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 10 వేల 776 కరోనా కేసులు నమోదయ్యాయి.. దీంతో రాష్ట్రంలో వైరస్‌ బాధితుల సంఖ్య 4 లక్షల 76 వేల 506కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనాను నుంచి 3 లక్షల 70 వేల163 మంది కోలుకున్నారు.. ప్రస్తుతం లక్ష రెండు వేల 67 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఏపీలో కరోనా మరణాలు ఆందోళన పెంచుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 76 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య 4 వేల 276కి పెరిగింది.. జిల్లాల వారిగా గత 24 గంటల్లో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో చెరో తొమ్మిది మంది, గుంటూరు, కడప, నెల్లూరులో 8మంది చొప్పున కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖలో ఆరుగురు చొప్పున మృతి చెందారు.. గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1405 కరోనా కేసులు నమోదయ్యాయి.. నెల్లూరులో 1270, ప్రకాశంలో 1256 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story