ఏపీ ప్రజల మనోభావాలను పట్టించుకోని మోదీ సర్కారు...!

ఏపీ ప్రజల మనోభావాలను పట్టించుకోని మోదీ సర్కారు...!
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ లో ఓ వైపు ఆందోళనలు జరుగుతున్నా .. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ లో ఓ వైపు ఆందోళనలు జరుగుతున్నా .. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విశాఖ స్టీల్స్‌ ప్రైవేటీకరణలో వెనక్కి తగ్గడం లేదు. తాజాగా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదని కుండబద్దలు కొట్టింది. పార్లమెంట్‌ సాక్షిగా వైసీపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్రఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. స్టీల్‌ ప్లాంట్‌లో వందశాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

జనవరి 27నే విశాఖ స్టీల్ ప్లాంట్‌ పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేదని చెప్పారామె. ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పారు. మెరుగైన ఉత్పాధతక కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు జరుగుతుందని వెల్లడించారు.

షేర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌లోని నిబంధనల మేరకు ఉద్యోగుల శ్రేయస్సు పూర్తి స్థాయిలో విశ్లేషించాకే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్‌పై ప్రైవేటీకరణ విషయంలో జగన్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ లేదని...అయినప్పటికి నిర్దేశిత అంశాల్లో అవసరమైన మేరకు సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరామని తెలిపారు.

మరోవైపు... స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవీటీకరణను వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తును ఆందోళనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఒకటే ఉక్కు సంకల్పం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఉద్యమం ఎగిసిపడుతోంది. ప్రజలంతా ఒక్కటై నినదిస్తున్నారు. బీజెపి మినహా పార్టీలకతీతంగా అధికార, విపక్షాలు, కార్మిక, మహిళ, విద్యార్థి, ప్రజా సంఘాలు ఐకమత్యంగా సాగిస్తున్న పోరాటం చేస్తున్నారు.విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకుంది. బీజేపీ మినహా అన్ని రాజకీయా పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి.

ఉత్తరాంధ్ర, కోస్తా, విజయవాడ, రాయలసీమ ప్రాంతాలు విశాఖ ఉక్కు ధర్నాలతో దద్దలిల్లుతోంది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు జనం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఇటీవల ఏపీ బంద్‌కు కార్మిక, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు బీజెపియేతర పార్టీలన్నీ మద్దతు పలికాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి.

ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం కాగా.. విద్యా, వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా నిరసనలు తెలిపాయి. స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండేలా కేంద్రంతో చివరిదాకా పోరాడుతామంటున్నారు నేతలు. మోదీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని.. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మోదీ సర్కారు దేశాన్ని అమ్మకానికి పెడుతోందని విమర్శించారు కార్మిక సంఘాల నేతలు. విశాఖ ఉక్కు కోసం ప్రజలు పోరాడుతుంటే వైర్వేరు మార్గల్లో పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందంటూ మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story