కర్నూలు జిల్లాలో ప్రబలిన అతిసార.. కలుషిత నీరు తాగి నలుగురు మృతి
కర్నూలు జిల్లా ఆదోని, పాణ్యం ఏరియాల్లో అతిసార వ్యాధి కలకలం రేపుతుంది. ఆయా ప్రాంతాల్లో అతిసార వ్యాధి ప్రబలి నలుగురు మృతిచెందారు.

X
Vamshi Krishna7 April 2021 11:01 AM GMT
కర్నూలు జిల్లా ఆదోని, పాణ్యం ఏరియాల్లో అతిసార వ్యాధి కలకలం రేపుతుంది. ఆయా ప్రాంతాల్లో అతిసార వ్యాధి ప్రబలి నలుగురు మృతిచెందారు. ఆదోనిలో ఇద్దరు చనిపోగా, పాణ్యంలో మరో ఇద్దరు మృతిచెందారు.. ఆదోని అరుణజ్యోతి నగర్‌లో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వివిధ గ్రామాల్లోని అతిసార బాధితులు ఆదోని, నంద్యాల ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాంతో ఆ రెండు ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. పాణ్యం మండలం గోరుకల్లులో అతిసార కారణంగా నీటి సరఫరాను నిలిపివేశారు. నంద్యాల నుంచి గోరుకల్లుకు ట్యాంకర్ల ద్వారా అధికారులు నీటిని సరఫరా చేయిస్తున్నారు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరంలో 25 మందికి చికిత్స అందిస్తున్నారు. కలుషిత నీటి సమస్య వల్ల ఇలాంటివి వస్తున్నాయని.. గ్రామస్తులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.
Next Story