AP Paper Leak: కిరాణా కొట్టులో లభిస్తున్న పదోతరగతి ప్రశ్నపత్రం..

AP Paper Leak: కిరాణా కొట్టులో లభిస్తున్న పదోతరగతి ప్రశ్నపత్రం..
AP Paper Leak: ఏపీలో పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌లు దుమారం రేపుతున్నాయి.

AP Paper Leak: ఏపీలో పదో తరగతి పరీక్షల్లో పేపర్‌ లీక్‌లు దుమారం రేపుతున్నాయి. వాట్సప్‌ గ్రూప్‌ల్లో ప్రశ్నపత్రాలు హల్‌చల్‌ చేస్తుండటంతో విద్యార్థులు డైలామాలో పడుతున్నారు. చిత్తూరు జిల్లా బుధవారం నాడు తెలుగు పేపర్‌ లీక్‌ కాగా.. వరుసగా రెండో రోజూ హిందీ పేపర్‌ లీకయ్యింది. వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లిలోని ఓ కిరాణా షాపులో పేపర్‌ కొనుక్కున్న విద్యార్థులు.. వాట్సప్‌లో ఫార్వర్డ్ చేయడం కనిపించింది.

అటు శ్రీకాకుళం జిల్లాలోనూ పదోతరగతి ప్రశ్నాపత్రం లీకైంది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస, షలంత్రి పరీక్షా సెంటర్ల లో పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ ప్రశ్నా పత్రం వాట్సప్‌ గ్రూపులలో చక్కర్లు కొట్టింది. తిరుపతిలో పేపర్‌ లీకేజీలకు నారాయణ కాలేజీయే వేదికని పోలీసులు నిర్ధారించారు. నారాయణ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రధాన సూత్రధారి గిరిధర్‌ రెడ్డేనని తేల్చేశారు. ప్రభుత్వం కూడా క్వశ్చన్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి నారాయణ కాలేజీ నుంచే లీకయ్యాయా..? లేక ఇతర ప్రాంతాల్లో కూడా లీకేజీలు జరుగుతున్నాయా అనే కోణాల్లో విచారిస్తున్నారు. మరోవైపు నంద్యాల జిల్లాలో జరిగింది పేపర్‌ లేక్‌ కాదు.. మాస్ కాపింగ్ అన్నారు పోలీసులు.

కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లిలో మాల్‌ ప్రాక్టీస్ చేసిన రాజేష్ అనే వ్యక్తితో పాటు 10మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.రాష్ట్రంలో ఎక్కడా పేపర్‌ లీక్‌ కాలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు.

ఎగ్జామ్‌ కంటే ముందు పేపర్‌ బయటికొస్తేనే దాన్ని లీక్‌గా భావిస్తారన్నారు. ఓవైపు .. వరుసగా ప్రశ్నాపత్రం లీకైనట్లు చెబుతున్నా.. మంత్రి బొత్స మాత్రం.. దీనికి విరుద్దంగా మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నాయి విపక్షాలు. పిల్లల భవిష్యత్తుతో ప్రభత్వం ఆటలు ఆడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story