MODI: సుపరిపాలనకు సరికొత్త కేంద్రం "నాసిన్‌"

MODI: సుపరిపాలనకు సరికొత్త కేంద్రం నాసిన్‌
దేశంలో పేదరికం తగ్గుతోందన్న ప్రధాని... లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించిన మోదీ...

పదేళ్లుగా తెచ్చిన సంస్కరణలతో దేశంలో రికార్డు స్థాయిలో పన్నులు వసూలు అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 541 కోట్లతో నిర్మించిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదకద్రవ్యాల అకాడమీ-నాసిన్ ను ప్రధాని ప్రారంభించారు. ఇది సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా., ప్రముఖ శిక్షణా సంస్థగా నిలుస్తుందని..మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.


సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండాలన్న ప్రధాని పన్నుల వ్యవస్థ కూడా సరళంగా ఉండాలని వివరించారు. GST రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామని గుర్తుచేసిన ప్రధాని ఆదాయపన్ను చెల్లింపు విధానం కూడా సులభతరం చేశామన్నారు. ఫలితంగా ఆదాయపన్ను చెల్లించేవారి సంఖ్య ఏటా పెరుగుతోందని తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని పేదలు, రైతులు, మహిళలు, యువకుల సంక్షేమానికి, అధునాతన మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తున్నామన్నారు. దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోందని చెప్పిన ప్రధాని.. 9 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు. అనేక కార్యక్రమాల వల్ల మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతోందని చెప్పారు.


నాసిన్‌.. దేశంలో ఆధునిక ఎకో సిస్టంగా మారనుందని ప్రధాని అన్నారు. ఇక్కడ జరిగే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఎంతో ప్రయోజనమని... రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేదని గుర్తు చేశారు. భూమి నీటిని గ్రహించి ఆవిరై తిరిగి వర్షంగా కురిసినట్టు పన్నుల విధానం ఉండాలని... జీఎస్‌టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామన్నారు. ఆదాయపన్ను చెల్లింపు విధానాన్నీ సులభతరం చేశామని... మేం వచ్చాక ఆదాయపన్ను పరిమితి పెంచామని... పన్ను చెల్లించే వారి సంఖ్య ఏటా పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. రికార్డు స్థాయిలో పన్నులు వసూలవుతున్నాయన్న ప్రధాని... వచ్చే ఆదాయంతో దేశంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. పదేళ్లుగా పన్ను రాబడి పెరిగింది. ఆ మొత్తంతో పెండింగ్‌లో ఉన్న అనేక పనులను పూర్తి చేశామని వెల్లడించారు.


అంతకుముందు... ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పకళా వైభవం లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ప్రధానికి స్వాగతం పలికారు. వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ విశిష్టత, శిల్పకళ సంపద గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. స్థలపురాణం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో..... వేలాడే స్తంభం గురించి ప్రధానికి అధికారులు వివరించారు. ఆలయ ప్రాంగణంలో తోలుబొమ్మలాటను ప్రధాని వీక్షించారు. రామాయణంలో సీతా దేవి అపహరణ సమయంలో ఈ ప్రాంతంలో జరిగిన జటాయువు ఘట్టాన్నివీక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story