Pulasa Fish: యమ్మీ 'పులస'.. ఎంతో తెలుసా.. వేలం పాటలో..

Pulasa Fish: యమ్మీ పులస.. ఎంతో తెలుసా.. వేలం పాటలో..
Pulasa Fish: పులస చేపల కూర తినడానికి పుస్తెలమ్మడానికైనా భోజన ప్రియులు సిద్ధపడతారని ఓ నానుడి ప్రచారంలో ఉంది.

Pulasa Fish: పులస చేపల కూర తినడానికి పుస్తెలమ్మడానికైనా భోజన ప్రియులు సిద్ధపడతారని ఓ నానుడి ప్రచారంలో ఉంది. అంతరేటు ఉంటుంది. అంతకంటే ఎక్కువ రుచిగా ఉంటుంది. అందుకే పులస అంటే అంత మోజు. మసాలా దట్టించి మాంచి రుచిగా వండితే ఆ ఘుమఘుమలకి నోరూరిపోదూ. చేపల కూర వాసన చెప్పకపోయినా తెలుస్తుంది.

గోదావరి వరద ఉధృతి తగ్గడంతో కాకినాడ యానాం మార్కెట్లో పులస చేప విక్రయాలు మొదలయ్యాయి. మంగళవారం వేలం పాట నిర్వహించగా 2 కిలోల బరువున్న తాజా పులస చేపను పార్వతి అనే మహిళ దక్కించుకుంది. దాన్ని భైరవపాలెంకు చెందిన వ్యక్తికి రూ.19 వేలకు విక్రయించారు.

ఈ సీజన్‌లో ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి అని స్థానికులు చెబుతున్నారు. భైరవపాలెం మొగ వద్ద ఇసుక మేటల వల్ల సముంద్రంలో నుంచి గౌతమి పాయలోకి పులసలు తక్కువగా వస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story