ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డుప్రమాదం.. పెళ్లి బృందం వ్యాన్ బోల్తా.. ఆరుగురు మృతి

ఘోర రోడ్డుప్రమాదం.. పెళ్లి బృందం వ్యాన్ బోల్తా.. ఆరుగురు మృతి
X

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్‌ అదుపు తప్పి కొండపైనుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే చనిపోగా.. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గోకవరం మండలం తంటికొండ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో.. కొండపైనుంచి వ్యాన్‌ కిందకు పడిపోయింది. మృతులంతా.. గోకవరం మండలం ఠాకూరుపాలెం గ్రామానికి చెందిన పెళ్లి బృందంగా గుర్తించారు. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.


Next Story

RELATED STORIES