Viveka Murder: కడప ఎంపీ టికెట్‌ కోసమే బాబాయి హత్య: షర్మిల

Viveka Murder: కడప ఎంపీ టికెట్‌ కోసమే బాబాయి హత్య: షర్మిల
Viveka Murder: కడప ఎంపీ టికెట్‌ కోసమే తన బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్య జరిగిందనే అభిప్రాయంతో సీఎం జగన్‌ సోదరి, YSRTP అధ్యక్షురాలు షర్మిల ఏకీభవించారు.

Viveka Murder: కడప ఎంపీ టికెట్‌ కోసమే తన బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానంద రెడ్డి హత్య జరిగిందనే అభిప్రాయంతో సీఎం జగన్‌ సోదరి, YSRTP అధ్యక్షురాలు షర్మిల ఏకీభవించారు. వివేకాను చంపిన వారేవరో తెలియాలని..వారికి శిక్షపడాలన్నారు.


వై.ఎస్‌.వివేకా కూతురు సునీతారెడ్డి చేస్తున్న న్యాయ పోరాటం..ఆమె అభిప్రాయాలతో సీబీఐ సైతం ఏకీభవించడం...ఏపీలో కేసు విచారణ నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని స్వయంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో ఆమే ఇదే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

2019 ఎన్నికల ముందు వివేకా హత్య జరిగింది. ఈ కేసులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అనుమానితుడిగా చేర్చి దర్యాప్తు జరుపుతోంది. ఆయన పాత్రకు సంబంధించిన వివరాలను చార్జిషీటులో పొందుపరిచింది.


కడప ఎంపీగా తనకు టికెట్‌ ఇవ్వకపోతే...షర్మిలకు లేదా విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని వైఎస్‌ వివేకా జగన్‌ను కోరారని... ఈ నేపథ్యంలోనే వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఈ హత్య చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ పేర్కొంది. దీనిపై మీ స్పందన ఏంటంటూ ప్రశ్నించగా...వాస్తవమే అంటూ షర్మీల సమాధానమిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story