ఎర్రచందనంపై పోలీస్ ఉన్నతాధికారులతో సిట్‌ భేటీ

ఎర్రచందనంపై పోలీస్ ఉన్నతాధికారులతో సిట్‌ భేటీ

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే విషయంలో జగన్‌ ప్రభుత్వంపై... స్పెషల్‌ సిట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతిలోని ఓ హోటల్‌లో పోలీస్ ఉన్నతాధికారులతో సిట్‌ భేటీ అయింది. ఈ సమావేశానికి రెడ్ శాండల్ ఐజీ, అదనపు ఐజీ, ఆరు జిల్లాల ఎస్పీలు హాజరయ్యారు. అటవీ, పోలీస్ శాఖ పెండింగ్ ఫైల్స్‌ను పరిశీలించారు. ఎర్రచందనం కేసుల్లో నెలలు గడుస్తున్నా ఛార్జిషీట్లు నమోదు చేయకపోవడంపై సిట్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. సంవత్సరాల క్రితం పట్టుబడిన వాహనాలు తుప్పు పడుతున్నా చర్యలేవని సిట్‌ ప్రశ్నించింది. అటవీ, పోలీసు శాఖల తీరుపై సిట్ బృందం అసహనం వ్యక్తం చేసింది. అక్రమ రవాణాలో కింగ్ పిన్స్ డేటాపై సిట్‌ దృష్టిసారించింది.

పట్టుబడిన ఎర్రచందనం, స్మగ్లర్లు, నిందితుల లిస్ట్‌ సిట్‌ అధికారులు పరిశీలించారు. డీఎస్పీ పైస్థాయి అధికారులతో గోప్యంగా సమీక్ష నిర్వహిస్తోంది సిట్ బృందం. ఢిల్లీ నుంచి నలుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపిఎస్ స్థాయి అధికారులు.. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వచ్చినట్లు సమాచారం. ఎర్రచందనం కేసుల విచారణ ఆలస్యం కావడంతో వాహనాలు తుప్పు పట్టి పాడవుతున్నాయని బాధితులు ఫిర్యాదు చేయడంతో ..విచారణ చేయాలని గతంలో సిట్‌ అధికారులకు హైకోర్టు సూచించింది. దీంతో ఎంక్వైరీ వేగవంతం అయింది. వారం రోజుల్లోనే సిట్ బృందం నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story