Konaseema District: కోనసీమ జిల్లాలో సాఫ్ట్‌వేర్ కష్టాలు.. ఇంటర్నెట్ లేక..

Konaseema District: కోనసీమ జిల్లాలో సాఫ్ట్‌వేర్ కష్టాలు.. ఇంటర్నెట్ లేక..
Konaseema District: కోనసీమ జిల్లాలో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదు.

Konaseema District: కోనసీమ జిల్లాలో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. విధ్వంసం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు ఇంటర్‌ నెట్‌ను పునరుద్ధరించలేదు. దీంతో వర్క్‌ఫ్రం హోంలో విధులు నిర్వహిస్తున్న ఐటీ ఉద్యోగులు.. నెట్‌ సిగ్నల్స్‌ కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఇంటర్‌ నెట్‌ కోసం పక్క జిల్లాలకు వెళ్లి.. విధులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఐదు రోజులు తీవ్ర కష్టాలు పడుతున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులంతా ఇంటర్‌నెట్‌ కోసం యానాం, కాకినాడ, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరం సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అక్కడే గదులు అద్దెకు తీసుకుని విధులు నిర్వహించుకుంటున్నారు. ఇటు ఆధార్‌, సీసీఎస్‌ కేంద్రాలకు కూడా ఇంటర్‌ నెట్‌ను పునరుద్ధరించలేదు. దీంతో సంక్షేమ పథకాల లబ్దిదారులు, రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు సచివాలయ సిబ్బంది కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం తక్షణం ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story