మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన టీడీపీ

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన టీడీపీ
న్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. విజయనగరం మేయర్‌తో పాటు పార్వతీపురం మున్సిపాలిటీలో 30వార్డులు, బొబ్బిలిలో 31, సాలూరులో 29, నెల్లిమర్ల నగరపంచాయతీలో 20 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటిసారి విజయనగరం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కార్పొరేషన్ స్థానం బీసీ మహిళకు కేటాయించారు అధికారులు. విజయనగరం కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లున్నాయి. ఈ 50 డివిజన్లకు గానూ 336 నామినేషన్స్ దాఖలయ్యాయి. దాదాపు 196 పోలింగ్ కేంద్రాల్లో 2లక్షల 2వేల 214 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 196 కేంద్రాల్లో 72 సమస్యాత్మక, 33 అతి సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు.

ఇక సాలూరు మున్సిపాలిటీని జనరల్ మహిళకు కేటాయించారు. 29 వార్డులకు గానూ 179 నామినేషన్స్ దాఖలయ్యావగా.. 49 పోలింగ్ కేంద్రాల్లో 39వేల 172 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 49 పోలింగ్ కేంద్రాల్లో 6 సమస్యాత్మక, 7 అతి సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు.

అటు పార్వతీపురం మున్సిపాలిటీ సైతం బీసీ మహిళకు కేటాయించారు అధికారులు. 30 వార్డులకు గానూ 176 నామినేషన్లు దాఖలవగా.. 49 పోలింగ్ కేంద్రాల్లో 37వేల 764 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 49 పోలింగ్ కేంద్రాల్లో 46 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు.

మరోవైపు బొబ్బిలి మున్సిపాలిటీ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించారు. 31 వార్డులకు గానూ 165 నామినేషన్లు దాఖలయ్యాయి. 62 పోలింగ్ కేంద్రాల్లో 45వేల 967 మంది ఓటర్లు తమ ఓటర్లున్నారు. 62 పోలింగ్ కేంద్రాల్లో 7 సమస్యాత్మక, 6 అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు అధికారులు. నెల్లిమర్ల మున్సిపాలిటీ పీఠం ఎస్సీ మహిళకు కేటాయించారు అధికారులు. 20 వార్డులకు గానూ 108 నామినేషన్లు దాఖలయ్యాయి. 19 పోలింగ్ కేంద్రాల్లో 18వేల 789 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు.

మొత్తంగా ఒక కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలకు సంబంధించి 160 డివిజన్లలో ఎన్నికలు ద్వారా 967 మంది భవితవ్యం తేలనుంది. ఒక వైపు పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి దీటుగా నిలబడి టీడీపీ సత్తా చాటింది. దీంతో అదే జోష్‌తో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది తెలుగుదేశం పార్టీ. అటు పట్టణాభివృద్ధిలో కీలకంగా వ్యవహరించేది పాలక మండళ్లే కావడంతో.. అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story