Nani on Ticket Rates : హీరో నాని సంచలన వ్యాఖ్యలు..!

Nani on Ticket Rates :  హీరో నాని సంచలన వ్యాఖ్యలు..!
Nani on Ticket Rates : ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల తగ్గింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్ నుంచి రియాక్షన్లు గట్టిగానే వస్తున్నాయి.

Nani on Ticket Rates : ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల తగ్గింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్ నుంచి రియాక్షన్లు గట్టిగానే వస్తున్నాయి.. తాజాగా న్యాచురల్‌ స్టార్‌ నాని కూడా ఘాటుగానే స్పందించారు.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. టికెట్‌ ధరలు తగ్గించడాన్ని నాని సున్నితంగా తప్పు పట్టారు.. రేపు శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రెస్‌మీట్‌లో ఆయన హాట్ కామెంట్స్‌ చేశారు.. సినిమా టికెట్‌ ధరలు తగ్గించడం అంటే ప్రేక్షకులను అవమానించడమే అన్నారు.

ఇప్పుడు చాలా చోట్ల 10, 15, 20 అనే మాటలు వింటున్నామని.. అది సరైనది కాదని నాని అన్నారు.. సినిమాలను, రాజకీయాలను కాసేపు పక్కన పెడితే.. పది మంది ఉద్యోగులను పెట్టుకుని నడుపుతున్న థియేటర్‌ కౌంటర్‌ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కౌంటర్‌ ఎక్కువుంటే అది లాజిక్‌ కాదు కదా అని మాట్లాడారు.. టికెట్‌ ధర పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని.. కానీ, ధరలను తగ్గించడి ప్రేక్షకులను అవమానించకూడదు కదా అంటూ ఏపీ ప్రభుత్వానికి నాని కౌంటర్‌ ఇచ్చారు.

ఈ సీజన్‌లో రిలీజైన పెద్ద సినిమాలు అన్నింటిపైన టికెట్ల రేట్ల ఎఫెక్ట్ పడింది. అఖండ, పుష్ప సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కాబట్టి సరిపోయింది కానీ.. లేదంటే ఈ రేట్ల తగ్గింపు ఎఫెక్ట్‌ భారీగా ప్రభావం చూపించేది. ఇక ఇప్పుడు శ్యామ్ సింగరాయ్‌ రిలీజ్ రేపు అనగా హీరో నానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు రిలీజ్ ఉంది అంటూనే.. ఏం మాట్లాడితే ఏమవుతుందో అనే సంశయం వెంటాడుతున్నా.. చివరికి చెప్పాలనుకున్నది చెప్పారు. ఏపీలో ప్రభుత్వం ధరలను నిర్ణయిస్తూ తీసుకున్న నిర్ణయం, ఆ జీవో 35పై ప్రస్తుతం ఇంకా హైకోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయ్.

అటు, ధియేటర్లలో వరుస తనిఖీలతో యాజమాన్యాలను హడలెత్తిస్తున్నారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల దాడులు చేసి కొన్ని ధియేటర్లను కూడా సీజ్ చేశారు. ఇలాగైతే మొత్తం సినిమా పరిశ్రమపైనే తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనలు అందరిలో కనిపించాయి. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు అంతా కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై అసహనంతోనే ఉన్నారు. కానీ ఎవరూ ధైర్యం చేసి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఆ మధ్య పవన్ కల్యాణ్ టికెట్ల రేట్ల నియంత్రణ విషయంపై నిలదీశారు. అప్పుడు దీనికి ప్రభుత్వం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ నానీ నిరసన గళం వినిపించడం సంచలనంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story