Tomato Rate : మళ్లీ పెరిగిన టమోటా ధరలు.. కిలో టమోట ఎంతంటే?

Tomato Rate : మళ్లీ పెరిగిన టమోటా ధరలు.. కిలో టమోట ఎంతంటే?
Tomato Rate : ఉల్లి,టమోటా పంటలు అత్యధికంగా సాగు చేసే కర్నూలు జిల్లాలో ఇప్పుడు టమాట ధరలు పెరిగిపోయాయి.

Tomato Rate : ఉల్లి,టమోటా పంటలు అత్యధికంగా సాగు చేసే కర్నూలు జిల్లాలో ఇప్పుడు టమాట ధరలు పెరిగిపోయాయి. గత ఇరవై రోజులకి ముందు కేజీ పది రూపాయలు ధర పలికిన టమోటా ఇప్పుడు 50 రూపాయలు దాటిపోయి 70 నుంచి 80 వరకు అమ్మకాలు సాగుతున్నాయి. రైతు బజార్,వ్యవసాయ మార్కెట్ లలోనే కిలో రూ 50 నుంచి 60 వరకు అమ్మకాలు సాగుతుంటే..బహిరంగ మార్కెట్ లలో అదే టమోటా కేజీ..70 నుంచి 80 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనేక మండలాల పరిధిలో సాగునీటి కాలువలు, బోరుబావుల కింద టమోటాను అధికంగా సాగు చేసేవారు. జిల్లా వ్యాప్తంగా పదివేల హెక్టార్ల దాకా టమోటాను సాగు చేసే వారు పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు. కనీసం 5 వేల హెక్టార్లలో కూడా ఆశించిన స్థాయిలో టమోటా సాగు కాలేదు. బోరు బావుల కింద కేవలం 500ల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు అతివృష్టి అనావృష్టి కారణంగా దిగుబడులు పూర్తిగా పడిపోయి. ఫలితంగా టమోటా కు విపరీతంగా డిమాండ్ వచ్చేసింది.

ఇప్పటికే వంట గ్యాస్,నూనె, నిత్యావసర ధరలు పెరిగి అల్లాడుతున్న ప్రజలకు పెరిగిన కూరగాయల ధరలుమరింత భారంగా మారాయి.. ధరల నియంత్రణ పై జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని..సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పరిస్థితి ఇలాగే ఉంటే ఏమీ కొనలేము ఏమి తినలేమని ప్రజలు వాపోతున్నారు.

పెళ్లిళ్ల సీజన్,రంజాన్ మాసం కలసి రావడంతో టమోటా వినియోగం పెరిగింది. కర్నూలు జిల్లాలో టమోటా దిగుబడులు పడిపోవడంతో వ్యాపారులు పక్క జిల్లా ,పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.. మదనపల్లె ,తెలంగాణ ప్రాంతాలను పంటను దిగుమతి చేసుకుంటున్నారు.. దీంతో టమోటా కు ఊహించని విధంగా డిమాండ్ వచ్చేసింది.ఈ ప్రభావం అంతా పెదా సమాన్యులపై పడింది.

Tags

Read MoreRead Less
Next Story