Gudivada Casino : గుడివాడ క్యాసినో పై TV5 వద్ద సరికొత్త ఆధారాలు..!

Gudivada Casino : గుడివాడ క్యాసినో పై TV5 వద్ద సరికొత్త ఆధారాలు..!
Gudivada Casino : ఏపీలో కొద్దిరోజులుగా కాక రేపుతున్న క్యాసినోపై టీవీ5 సరికొత్త ఆధారాలు సంపాధించింది. గుడివాడలోనే క్యాసినో నిర్వహించారనడానికి పక్కా ఆధారాలతో ముందుకొచ్చింది.

Gudivada Casino : ఏపీలో కొద్దిరోజులుగా కాక రేపుతున్న క్యాసినోపై టీవీ5 సరికొత్త ఆధారాలు సంపాధించింది. గుడివాడలోనే క్యాసినో నిర్వహించారనడానికి పక్కా ఆధారాలతో ముందుకొచ్చింది. గుడివాడలోని K-కన్వెన్షన్‌ను ఆనుకునే క్యాసినో ఏర్పాట్లు జరిగాయి. క్యాసినో నిర్వహణకు ముందే ఏర్పాట్లను స్థానికులు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. గుడివాడలో మొట్టమొదటిసారిగా క్యాసినో నిర్వహిస్తున్నారంటూ లైవ్‌లో స్పష్టంగా చెప్పారు. ఫేస్‌బుక్‌లో స్థానికులు పెట్టిన వీడియోలన్నీ ఇప్పుడు టీవీ5 దగ్గరికొచ్చాయి.

కొడాలి కన్వెన్షన్ సమీపంలోనే క్యాసినో నిర్వహించారని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. అయితే గుడివాడలో ఇంత పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతోంది మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయినా కొడాలి నానికి కనిపించలేదా....? గుడివాడలో క్యాసినో నిర్వహిస్తే స్థానిక మంత్రికి బాధ్యత ఉండదా....? కన్వెన్షన్ చుట్టుపక్కల ప్రాంతమంతా మంత్రి ఆధీనంలో ఉంది వాస్తవం కాదా...? క్యాసినో నిర్వహించిన ప్రాంతానికి యజమాని మంత్రి కాకపోతే ఇంకెవరు....? గుడివాడలో క్యాసినో నిర్వహించలేదని కొడాలి నాని చెప్పగలరా..? సోషల్‌ మీడియాలో గుడివాడ క్యాసినో గురించి వీడియోలు, ఫొటోలు వస్తుంటే.. వాటికి కొడాలి నాని ఏం సమాధానం చెప్తారు..?

గుడివాడ క్యాసినోపై టీడీపీ, బీజేపీ ఒక్కొక్కటిగా ఆధారాలు బయటపెడుతున్నాయి. దీనిపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన టీడీపీ... గుడివాడలోనే క్యాసినో నిర్వహించినట్టు ఆధారాలను పోలీసులకు అందించింది. మంత్రి కొడాలినానిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎసిస్ వారి సౌజన్యంతో గుడివాడలో క్యాసినో అంటూ ఉన్న ఫేస్ బుక్ పోస్టులు అబద్ధమా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. అసలు క్యాసినోకు ఆంధ్రప్రదేశ్ లో ఎపుడు అనుమతిచ్చారు...? అనుమతి లేకపోతే చర్యలేవని ప్రశ్నించింది. అనుమతి లేని సినిమా థియేటర్లను సీజ్ చేసిన ప్రభుత్వం... క్యాసినో జరిగిన ప్రదేశాన్ని సీజ్ చేస్తుందా అని ప్రశ్నిస్తోంది.

ఇక టీడీపీ, బీజేపీ బయటపెట్టిన ఆధారాలపై కొడాలినాని ఏమంటారు..? గుడివాడలో క్యాసినో నిర్వహణపై ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత.. స్థానిక ఎమ్మెల్యేగా కొడాలి నానిపై లేదా..?



Tags

Read MoreRead Less
Next Story