Visakhapatnam: ఆస్పత్రికి వెళ్లేందుకు రోడ్డు లేదు.. పురిటి బిడ్డను కోల్పోయిన గిరిజన దంపతులు

Visakhapatnam: ఆస్పత్రికి వెళ్లేందుకు రోడ్డు లేదు.. పురిటి బిడ్డను కోల్పోయిన గిరిజన దంపతులు
Visakhapatnam: దేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించింది అని గొప్పలు చెప్పుకునే నాయకులకు ఇలాంటి సంఘటనలు కంటికి కనిపించవు.

Visakhapatnam: దేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించింది అని గొప్పలు చెప్పుకునే నాయకులకు ఇలాంటి సంఘటనలు కంటికి కనిపించవు. మారు మూల గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక జీవనం సాగిస్తున్న నిరుపేదలు ఎందరో ఉన్నారు. విశాఖపట్నం అర్ల పంచాయితీలోని గిరిజన తండాకు చెందిన ఓ యువజంట తమ నవజాత శిశువును కోల్పోయింది. శశి భార్య కమల నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరికీ అత్యవసర వైద్య సహాయం అవసరం అని చెప్పారు స్థానిక వైద్యులు. దాంతో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు కాలినడకన బయలుదేరారు. బాలింతరాలైన కమలని, పురిటి బిడ్డను జోలెలో కూర్చొబెట్టి తీసుకువెళ్లారు. కానీ పీహెచ్‌సీకి వెళ్లేసరికి అప్పటికే పాప మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.

కమలకు హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని పీహెచ్‌సీ వైద్యులు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 'ఆర్ల పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో మొత్తం 250 మంది నివసిస్తున్నారు. అయితే ఇక్కడ కనీసం అంగన్‌వాడీ కేంద్రం లేదు. పాఠశాల లేదు. రోడ్లు లేవు. విశాఖపట్నం నుంచి అనకాపల్లిని తీర్చిదిద్దిన అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించి నిరసన చేపట్టాం. ఇప్పటికీ రోడ్లు లేవు'' అని ఆంధ్రప్రదేశ్ ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు కె.గోవిందరావు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story