Visakhapatnam: అభివృద్ధి పేరుతో అరాచకం.. రిషికొండ వివాదం: సీపీఐ నేత నారాయణ

Visakhapatnam: అభివృద్ధి పేరుతో అరాచకం.. రిషికొండ వివాదం: సీపీఐ నేత నారాయణ
Visakhapatnam: విశాఖలోని రిషికొండ వద్ద మరోసారి హై టెన్షన్ నెలకొంది. రిషికొండ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధించారు.

Visakhapatnam: విశాఖలోని రిషికొండ వద్ద మరోసారి హై టెన్షన్ నెలకొంది. రిషికొండ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధించారు.ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. రుషికొండను పరిశీలించేందుకు సీపీఐ నేత నారాయణ, రామకృష్ణ వచ్చారు. వారి వెంట సీపీఐ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే.. నారాయణ ఒక్కరినే రుషికొండ సందర్శనకు అనుమతిచ్చారు పోలీసులు. అటు.. మీడియాను సైతం బయటే నిలిపివేశారు.



ప్రభుత్వ తీరుపై నారాయణ మండిపడ్డారు. సహజసిద్ధమైన రిషికొండను ధ్వంసం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఇది సహజవనరులు, పర్యావరణాన్ని నాశనం చేయడమేనన్నారు. రిషికొండలో లగ్జరీ విల్లాలు కడుతున్నారని.. జగన్‌ ఇల్లు ఎలా కట్టుకున్నారో ఈ విల్లాలు కూడా అలాగే కడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో అరాచకం జరుగుతుందని విమర్శించారు. సహజ సిద్ధమైన రుషికొండ మళ్లీ వస్తుందా అని నారాయణ ప్రశ్నించారు.


అంతా పారదర్శకంగా ఉంటే పోలీసుల ఆంక్షలు ఎందుకని నారాయణ ప్రశ్నించారు. రిషికొండకు తానేమైనా పేలుడు పదార్ధాలు తీసుకెళ్తున్నానా అంటూ ప్రశ్నించారు. పోలీసులు అనుమతి ఇచ్చేందుకు నెలలు కావాలా? అని నిలదీశారు. కొండపై జరుగుతున్న నిర్మాణాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారని గళమెత్తారు. కొండను తవ్వడం నేరమని పేర్కొన్నారు. మిడిమిడి జ్ఞానంతో మంత్రులు మాట్లాడటం సమంజసం కాదన్నారు. మీడియాపై కూడా ఆంక్షలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story