Viveka murder case: ఈరోజు సుప్రీంలో విచారణ

Viveka murder case: ఈరోజు సుప్రీంలో విచారణ
షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్‌ చేసే అధికారం తనకే ఉందని స్పష్టం చేయాలని వివేకా మాజీ పీఎ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వివేకా హత్య కేసులో సునీత పిటిషన్ పై ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది. షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్‌ చేసే అధికారం తనకే ఉందని స్పష్టం చేయాలని వివేకా మాజీ పీఎ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో ఇంప్లీడ్ అయ్యారు సునీత. ఈ కేసులో ఎంవీ కృష్ణారెడ్డి బాధితుడు కాదని, దర్యాప్తును అడ్డుకోవడానికే ఆయన ప్రయత్నిస్తున్నారంటూ తన ఇంప్లీడ్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. షేక్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్‌ చేసే అధికారం తనకే ఉందని స్పష్టం చేయాలని కృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ దరఖాస్తులో సునీత ఇంప్లీడ్‌ అయ్యారు. హత్య విషయంలో కృష్ణారెడ్డి ముందుగా సమాచారం ఇచ్చినంత మాత్రాన ఆయన బాధితుడు కాదన్నారు. కనీసం కుటుంబ సభ్యుడు కూడా కాదని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో సీబీఐ ఇవాళ ఏ విధమైన వాదనలు వినిపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో అవినాశ్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విషయంలో సీబీఐ కౌంటర్‌ వేయకుండా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అడ్డుకున్నారన్న తెలిసింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత నెల 30 నాటికే హత్య కేసు దర్యాప్తు పూర్తికావలసి ఉంది. ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి దర్యాప్తు గడువును పొడిగించాలని సీబీఐ కోరవచ్చని తెలుస్తోంది.

మరోవైపు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ఆర్థిక స్థోమత లేదని న్యాయ సహాయం కల్పించాలని సుప్రీంకోర్టు లీగల్‌సెల్‌ సర్వీసెస్‌ కమిటీకి అభ్యర్థించారు.అటు దస్తగిరి అప్రూవర్‌గా మారటాన్ని నిందితుడు శివశంకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం ఈ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.నిందితులకు ఇలాంటివి కోరే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story