VIVEKA MURDER CASE: ఏం జరగబోతోంది...

VIVEKA MURDER CASE: ఏం జరగబోతోంది...
సీబీఐ దర్యాప్తు డెడ్‌లైన్‌ ఇవాల్టితో ముగియనుంది.

వివేకా హత్య కేసులో ఇవాళ ఏం జరగబోతోంది..ఇదే చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది.. సీబీఐ దర్యాప్తు డెడ్‌లైన్‌ ఇవాల్టితో ముగియనుంది.దీంతో సీబీఐ ఏం చేస్తున్నది ఆసక్తి మారింది. జూన్‌ 30లోపు విచారణ ముగించాలని గతంలో సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.దీంతో ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో సీబీఐ స్టేటస్‌ రిపోర్ట్‌ సబ్‌మిట్‌ చేయనుంది. అయితే, దర్యాప్తు పూర్తి చేయడానికి మరికొంత సమయం కోరుతుందా లేక చివరి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తుందా అనేది కూడా ఉత్కంఠను రేపుతోంది.

ఇక ఈ కేసులో ఎనిమిదో నిందితుడుగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఏ మేరకు విచారణకు సహకరించారనే విషయాన్ని సీబీఐ కోర్టుకు తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అవినాష్‌ రెడ్డిని అనేక మార్లు సీబీఐ అధికారులు విచారించారు.విచారణ సమయంలో ఓసారి ఆయన్ను అరెస్టు చేసి పూచీకత్తుపై విడుదల చేశారు.విచారణకు సహకరించడం లేదని ప్రధానంగా సీబీఐ ఆరోపిస్తోంది.ఇదే విషయాన్ని అనేకసార్లు కోర్టుల్లోనూ ప్రస్తావించింది.అవినాష్‌ రెడ్డి విచారణకు సహకరించకపోవడం వల్ల దర్యాప్తు పూర్తి కాలేదని ఇప్పుడు కూడా సీబీఐ అధికారులు కోర్టుకు తెలపనున్నట్లు సమాచారం.

మరోవైపు వచ్చే నెల 3న సుప్రీంకోర్టులో అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది.ఇటు హైకోర్టు కూడా ఈ నెలాఖరు వరకు అవినాష్‌ రెడ్డిని విచారించవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో అవినాష్‌ రెడ్డిని పలుమార్లు సీబీఐ విచారించింది.కొద్దిరోజుల క్రితం సీబీఐ అధికారులు అడిగిన కొన్ని డాక్యుమెంట్లు కూడా అవినాష్‌ రెడ్డి నేరుగా వారికి అందజేశారు.ఇక హైకోర్టు ఇచ్చిన గడువు ఇవాల్టితో ముగియనుండగా సీబీఐ ఏం చేస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.మొత్తంగా వివేకా హత్య కేసులో తదుపరి పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story