దళిత మహిళ జేఏసీ నాయకురాలు శిరీషను అడ్డుకున్న పోలీసులు

దళిత మహిళ జేఏసీ నాయకురాలు శిరీషను అడ్డుకున్న పోలీసులు

అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అరెస్టులతో రాజధాని ప్రాంతం అట్టుడుకుతోంది. ఇటీవల కృష్ణాయపాలెంలో దళిత రైతులకు సంకెళ్లు వేయడంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. శనివారం గుంటూరు జిల్లా జైలు భరోకి పిలుపు ఇచ్చారు జేఏసీ నేతలు.. దీంతో జేఏసీ నేతలు, రైతులు, మహిళలు భారీ సంఖ్యలో గుంటూరు బయలు దేరారు. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులతో ఆందోళనకారులను అడ్డుకుంటున్నారు.

దళిత మహిళ జేఏసీ నాయకురాలు శిరీషను ఆమె ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు.. బయటకు వెళ్లకుండా నిర్భందించడంపై నిలదీశారు శిరీష. అరెస్టులతో భయపెట్టాలి అనుకంటున్నారా అని ప్రశ్నించారు. శిరీషకు మద్దతుగా మరికొందరు దళిత మహిళలు అక్కడికి చేరుకున్నారు. శిరీషతో పాటు, ఇతర మహిళలను అరెస్టు చేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story