జగన్ పాలనలో ప్రచారం ఎక్కువ.. వివిధ వర్గాలకు లబ్ది తక్కువ : యనమల

జగన్ పాలనలో ప్రచారం ఎక్కువ.. వివిధ వర్గాలకు లబ్ది తక్కువ : యనమల
గత 20 నెలల్లో వైసీపీ నేతల ఆస్తులు పెరిగాయి కానీ.. ప్రజల ఆస్తులు పెరగలేదన్నారు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు.

గత 20 నెలల్లో వైసీపీ నేతల ఆస్తులు పెరిగాయి కానీ.. ప్రజల ఆస్తులు పెరగలేదన్నారు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి వేయాలి.. ఎందుకు వేయాలి అని ప్రజలు పరిశీలించుకోవాలని ఆయన కోరారు. రెండు ఆర్ధిక సంవత్సరాల్లో కేటాయింపులకు తగ్గ ఖర్చులు లేవన్నారు.

బడ్జెట్ అంచనాలు పేరుకు మాత్రమే ఉన్నాయని.. వాటి కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేదని యనమల ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో 20నెలల్లో అసలు అభివృద్ధే లేదన్నది ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయని.. 20నెలల పాలనను ప్రజలు బేరీజు వేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు యనమల రామకృష్ణుడు.

20నెలల్లో పట్టణ ప్రాంతాల్లో పెదరికం, ఆర్ధిక అసమానతలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. జగన్ పాలనలో ప్రచారం ఎక్కువని.. అనేక వర్గాలు జీవనోపాధి కోల్పోయారని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించి నేరాలు పెరిగిపోయాయని.. ఈ నేపథ్యంలో సుపరిపాలన ఎవరు ఇస్తారనేది ప్రజలు ఆలోచించాలని కోరారు యనమల రామకృష్ణుడు.

Tags

Read MoreRead Less
Next Story