AP: వైసీపీకి మరో భారీ షాక్‌..మాగుంట రాజీనామా

AP: వైసీపీకి మరో భారీ షాక్‌..మాగుంట రాజీనామా

వైసీపీని వీడుతున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని... ఒంగోలులో తెలిపారు. ఇవాళే వైసీపీకి రాజీనామా చేస్తున్నామన్న ఆయన... మాగుంట రాఘవరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సీఎం జగన్ ను మా కుటుంబసభ్యుడిగా చూశామని మాగుంట... అన్నారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అన్న మాగుంట... తమ కుటుంబానికి ఉన్న గౌరవం నిలబెట్టుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు..తమకు అహం లేదని.. ఆత్మగౌరవమే ఉందని మాగుంట వ్యాఖ్యానించారు.


Tags

Read MoreRead Less
Next Story