Top

సీఎం జగన్‌పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. తనను అడ్డు తొలగించుకునేందుకు

సీఎం జగన్‌పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ సీఎం జగన్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. తనను అడ్డు తొలగించుకునేందుకు సీఎం జగన్ కడప నుంచి మనుషులను దింపుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని హితువు పలికారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని.. తనకు ప్రాణహాని ఉందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లానిని కలిసి ఫిర్యాదు చేశానన్నారు. తనకు ఏంజరిగినా ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్న రఘురామ.. జగన్ కేసు తేలే వరకు ఏపీలో అడుగు పెట్టనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత దిగుజారుతోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములను జగన్ ప్రభుత్వం అమ్మకాలకు పెట్టిందన్న ఆయన.. త్వరలో రాష్ట్రాన్ని కూడా అమ్మకానికి పెడుతుందని ఆరోపించారు.

Next Story

RELATED STORIES