YSRCP: వైసీపీ పాలనలో దళితులపై కక్ష సాధింపు

YSRCP: వైసీపీ పాలనలో దళితులపై కక్ష సాధింపు

వైసీపీ పాలనలో దళితులపై కక్ష సాధింపు కొనసాగుతోంది. టీడీపీ పక్షాన ఉన్నారన్న అక్కసుతో దళితులకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలను రద్దు చేయించారు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి. ఆత్మకూరు మండలం బి.యాలేరులో టీడీపీ ప్రభుత్వ హయాంలో 240 మంది దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. అప్పట్లోనే మాజీ మంత్రి పరిటాల సునీత చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే సీన్ మారిపోయింది. ఇళ్ల స్థలాల లబ్ధిదారులంతా టీడీపీ సానుభూతిపరులన్న సాకుతో పట్టాలను రద్దు చేశారు. అదే స్థలంలో తమ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి ఇవాళ ఇళ్ల పట్టాలను అందజేశారు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ రెడ్డి.

ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా గ్రామంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దళితులను ఇళ్ల నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినా కొంత మంది దళితులు ఎమ్మెల్యే సభలో నిరసన తెలిపారు. అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. దళితుల ఆందోళనతో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి... రెవెన్యూ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పట్టాల పంపిణీని మధ్యలో ఆపేసి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి తీరుపై యాలేరు దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story