YCP: వైసీపీ నేతలూ... మరీ ఇంత బరితెగింపా..?

YCP: వైసీపీ నేతలూ... మరీ ఇంత బరితెగింపా..?
జగన్‌ సమక్షంలోనే విలేకరిపై మూక దాడి... తీవ్ర గాయాలతో ఆస్పత్రికి జర్నలిస్ట్‌.. వైసీపీ అల్లరిమూకల దాడిని ఖండించిన టీడీపీ....

రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ కృష్ణపై వైసీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. జగన్ మాట్లాడుతుండగా వేలాదిగా జనం వెళ్లిపోతున్న ఫోటోలు తీస్తుండగా వంద మందికిపైగా వైసీపీ మూకలు దాడికి తెగబడ్డారు. కర్రలతో కొడుతూ, కాళ్లతో తంతూ, చొక్కా చించి పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. పక్కనే పోలీసులున్నా నిలువరించే ప్రయత్నం చేయలేదు.దాడిచేసిన వారిని ఏమాత్రం పట్టించుకోని పోలీసులు, తీవ్రంగా గాయపడిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నే తిట్టుకుంటూ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. నోటి నుంచి రక్తం కారుతున్నా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా రాప్తాడు స్టేషన్ లో కూర్చోబెట్టారు. చివరకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ అల్లరి మూకల దాడిని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి నారాలోకేష్ తీవ్రంగా ఖండించారు. సిద్ధం సభ ఫోటోలు తీయడం నిషిద్ధమా, నేరమా అని నిలదీశారు. ఇది మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి అని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయించడం తగదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక పత్రిక, ఛానెల్ యజమాని అయిన జగన్ ఇటువంటి దాడులు ప్రోత్సహించడం, తన సంస్థల్లో పనిచేసే వారందరినీ రిస్క్ లో పెట్టడమేనని దుయ్యబట్టారు.


ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన మీడియాని జగన్ రెడ్డి కక్షతో కూలగొడుతున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసీపీ రౌడీ మూకల దాడి దుర్మార్గమని మండిపడ్డారు. కవరేజ్ జి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం ఏంటి అని ప్రశ్నించారు. జగన్ సభలకు ఆయన కూలి మీడియా, నీలి మీడియా తప్ప మిగతా మీడియా రాకూడదా అని నిలదీశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు. వైకాపా పాలన వైఫల్యాలు, వైకాపా నేతల అవినీతిని వెలికితీసిన వారిపై కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాప్తాడు ఘటనలో నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story