Germany Metro Stores: బిజినెస్ బాలేదు.. ఇండియాలో 'మెట్రో' క్లోజ్ ..

Germany Metro Stores: బిజినెస్ బాలేదు.. ఇండియాలో మెట్రో క్లోజ్ ..
Germany Metro Stores: పలు దేశాల్లో కూడా మెట్రో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.. ఇప్పటికే రష్యా, జపాన్, మయన్మార్ వంటి దేశాల నుంచి మెట్రో నిష్క్రమించింది.

Germany Metro Stores: ఎంతో ఆశించాం.. కొంతైనా సంతృప్తికరంగా లేదు.. అందుకే గుడ్ బై చెబుతున్నాం అంటున్నాయి జర్మన్ కి చెందిన ప్రముఖ రిటైల్ బిజినెస్ సంస్థ మెట్రో స్టోర్స్.. ఇండియాలో తమ వ్యాపారం ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మెట్రో వ్యాపారస్తులు. 19 ఏళ్ల పాటు కొనసాగించిన తమ బిజినెస్ కార్యకలాపాలకు ముగింపు పలకనుంది.

వంద శాతం విదేశీ పెట్టుబడులతో దేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రోస్టోర్లు ఏర్పాటయ్యాయి. 2003లో ఇండియాలో బిజినెస్ మొదలు పెట్టి.. దేశంలోని 21 నగరాల్లో 31 స్టోర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కూకట్ పల్లిలో తొలిసారి మెట్రో స్టోర్ ఏర్పాటు కావడం అప్పట్టో పెద్ద సంచలనం. ఆ తర్వాత అనేక సంస్థలు అదే తరహాలో రిటైల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాయి.

ఇండియాలో రిటైల్ స్టోర్లతో పాటు కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ లో ఐదు కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. ఏడు వేల రకాలకు పైగా వస్తువులు మెట్రో స్టోర్లలో అమ్ముతున్నారు. 2025 నాటికి ఇండియాలో మెట్రో బిజినెస్ అంచనా 1.25 బిలియన్ డాలర్లుగా ఉంది.

అయితే బిజినెస్ అనుకున్న స్థాయిలో లేదని, ప్రస్తుతం ఉన్న పోటీ పరిస్థితిని తట్టుకోవడం కష్టంగా మారిందని యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో ఇండియాలో తమ బిజినెస్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాయి.

మెట్రోకు సంబంధించిన స్థిర, చర ఆస్తులను కొనుగోలు చేసేందుకు రిలయన్స్, అమెజాన్, డీమార్ట్ వంటి ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

పలు దేశాల్లో కూడా మెట్రో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.. ఇప్పటికే రష్యా, జపాన్, మయన్మార్ వంటి దేశాల నుంచి మెట్రో నిష్క్రమించింది. ఇప్పుడు ఇండియా కూడా ఆ జాబితాలో చేరింది.

Tags

Read MoreRead Less
Next Story