Zomato : పుంజుకుంటున్న జొమాటో.. నష్టాల నుంచి లాభాల్లోకి..

Zomato : పుంజుకుంటున్న జొమాటో.. నష్టాల నుంచి లాభాల్లోకి..

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారమ్ జొమాటో (Zomato) తాజాగా తన ఆర్థిక ఫలితాలను రిలీజ్ చేసింది. 2023-24 అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.138కోట్లుగా నమోదైంది. గతేడాది ఈ సంస్థ రూ.347కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. భారీ నష్టాలను ఎదుర్కొంటున్న జొమాటో ఈ సారి లాభాలను అందుకోవడం గమనార్హం.

నూతన సంవత్సర వేడుకల సమయంలోనూ జొమాటో పెద్ద ఎత్తున డెలివరీలు చేసింది. కొంత కాలంగా భారీగా పడిపోయిన జొమాటో షేర్ల ధర.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. తమ కంపెనీ అంచనాలను మించి వృద్ధిని కొనసాగిస్తోందని ఈ సందర్భంగా ఆ సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ చెప్పారు. రానున్న రోజుల్లో స్థూల పునరుద్ధరణను చూస్తే ఈ లాభాలు మరింత పెరిగే అవకాశముందని.. కస్టమర్లు, రెస్టారెంట్లు, వాటాదారుల ప్రయోజనాలను రక్షించుకుంటూ వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story