కేవలం 10 నెలల్లోనే రూ.1600 కోట్ల మద్యం తాగారు

కేవలం 10 నెలల్లోనే రూ.1600 కోట్ల మద్యం తాగారు

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఢిల్లీకి ఆనుకుని ఉన్న గౌతమ్ బుద్ధ నగర్‌లో పది నెలల వ్యవధిలో మద్యం వినియోగం గణనీయంగా పెరిగింది. దాదాపు రూ. 1600 కోట్లతో ఉత్తరప్రదేశ్‌లో మద్యం విక్రయాల్లో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలు దాదాపు 25 శాతం పెరిగాయి.

గౌతమ్ బుద్ధ నగర్‌లోని ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ కమీషనర్ నుండి ప్రశంసా పత్రాన్ని అందుకుంది. గౌతంబుద్ద నగర్‌లోని ఎక్సైజ్ శాఖకు గత 10 నెలల్లో సుమారు రూ.1600 కోట్ల ఆదాయం వచ్చిందంటే.. కేవలం 10 నెలల్లోనే ఇక్కడి ప్రజలు రూ.1600 కోట్ల మద్యం తాగారు. మద్యం విక్రయాలు పెరగడంతో ఆదాయం కూడా పెరిగింది. దీంతో ఎక్సైజ్ అధికారిని ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రంతో సత్కరించారు.

గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా ఎక్సైజ్ అధికారి సుబోధ్ కుమార్ మాట్లాడుతూ.. 2023-24 సంవత్సరానికి రూ.2324 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ ఇప్పటికే కేవలం 10 నెలల్లోనే సుమారు 1600 కోట్ల రూపాయల ఆదాయం సాధించామని, గతేడాదితో పోలిస్తే ఈ 25 శాతం పెరుగుదలను సూచిస్తుంది". మార్చి నెలాఖరు నాటికి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటామని ఆయన పేర్కొన్నారు

Tags

Read MoreRead Less
Next Story