Gold Prices : తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Gold Prices : తగ్గిన బంగారం ధరలు..  తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం (Gold), వెండి (Silver) ధరలు తగ్గుముఖం పట్టాయి. 2024 ఫిబ్రవరి 09వ తేదీ శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గగా... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.70 తగ్గింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.57,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.63,160గా ఉంది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడలోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.58,050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.63,310గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.57,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.63,160గా ఉంది.

ఇక, వెండి ధరలు విషయానికి వస్తే.. ఇవాళ కేజీ వెండి రూ.500 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.76 వేలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76వేలుగా ఉంది

Tags

Read MoreRead Less
Next Story