Gold Rate in 2022: పసిడి ప్రియులకు షాక్.. వచ్చే ఏడాదిలో..

Gold Rate in 2022: పసిడి ప్రియులకు షాక్.. వచ్చే ఏడాదిలో..
Gold Rate in 2022: ఈ ఏడాది బంగారం ధరలో పెద్దగా మార్పులేం కనిపించలేదు. కాని,

Gold Rate in 2022: వచ్చే ఏడాదంతా తనదేనంటోంది పసిడి. మరోసారి పదిగ్రాముల బంగారం ధర 55వేల రూపాయలకు ఎగబాకడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది బంగారం ధరలో పెద్దగా మార్పులేం కనిపించలేదు. కాని, 2020లో మాత్రం కనకమహాలక్ష్మి కొండెక్కి కూర్చుంది. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం గడప దాటి బయటకు రాకపోయినా సరే.. గోల్డ్‌ కొనే వాళ్లే లేకపోయినా సరే.. తులం 57వేల రూపాయలు పలికింది. వచ్చే ఏడాది మళ్లీ అదే ఊపుతో దూసుకుపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చేతిలో డబ్బులు ఉండి, కొనే అవసరం ఉంటే.. వెంటనే బంగారం ధరలు కొనేసుకోండని మహిళలకు సలహా ఇస్తోంది బులియన్ మార్కెట్. నెక్లెస్‌లు, చైన్‌లు, ఇతర ఆభరణాలు కొనుక్కునేందుకు ఇదే సరైన సమయం అని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఇప్పుడున్నంత ధరలు ఉండకపోవచ్చనేది అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు పెరగడానికి ఒమిక్రానే కారణం కాబోతోంది. ఒకవేళ ఒమిక్రాన్ మరింత విజృంభిస్తే.. పలు దేశాలు కఠిన ఆంక్షలు విధించొచ్చు.

కర్ఫ్యూ నుంచి లాక్‌డౌన్‌ వరకు వెళ్లొచ్చు. అదే జరిగితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడి తప్పుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లందరూ తమ పెట్టుబడులను సురక్షితంగా భావించే బంగారంలోకే తీసుకొస్తారు. 2020 కరోనా సమయంలో జరిగింది ఇదే. అందుకే, ఆనాడు పది గ్రాముల పసిడి ధర 57వేల రూపాయలకు చేరింది.

బంగారం ధరకు, ఒమిక్రాన్‌కు లింక్ ఏర్పడింది. ఒకవేళ ఒమిక్రాన్‌ బలహీనపడితే మాత్రం.. ధరలు యథాతథంగానే ఉండొచ్చు. మరోవైపు బంగారం ధరను ప్రభావితం చేయడానికి డాలర్‌కు కూడా రెడీ అవుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ధరలు విపరీతంగా పెరిగితే ఆ దేశ ఆర్థికవ్యవస్థకే నష్టం. ఇందుకోసం అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లు పెంచొచ్చు. అదే జరిగితే డాలర్‌కు డిమాండ్‌ పెరుగుతుంది. అప్పుడు పెట్టుబడులన్నీ డాలర్‌లోకి వెళ్తాయి. దీని ఫలితంగా బంగారం ధరలు ఇప్పుడున్న రేంజ్‌లోనే ఉండొచ్చని, కాస్త తగ్గినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.

ఒమిక్రాన్‌ కారణంగా స్టాక్‌మార్కెట్లు పతనమైనా సరే.. పసిడి ధరలు పెరగడం ఖాయం. ఒమిక్రాన్‌ కారణంగా బంగారం ధరలు పెరగొచ్చు అంటున్నారంటే.. స్టాక్‌మార్కెట్లు పడిపోతాయనే అంచనాలు ఉండి ఉండొచ్చు. అదే జరిగితే పెట్టుబడులన్నీ గోల్డ్‌లోకి వెళ్లిపోతాయి. దీంతో బంగారం ధర పెరగొచ్చు. ఏదేమైనా ఒమిక్రాన్‌ను జయిస్తేనే.. బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి. లేదంటే మాత్రం ఈసారి పసిడిని తాకాలన్నా కష్టమేనని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story