LIC IPO: ఎల్‌ఐసీ పాలసీదారులు ఐపీఓలో పాల్గొనాలంటే..

LIC IPO: ఎల్‌ఐసీ పాలసీదారులు ఐపీఓలో పాల్గొనాలంటే..
LIC IPO: ఎల్‌ఐసీ రికార్డుల్లో పాన్ అప్‌డేట్ అయితేనే ఐపీఓలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

LIC IPO: జీవిత బీమా రంగంలో అతిపెద్ద కంపెనీ ఎల్‌ఐసీ ఐపీఓలో పాల్గొనే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్లో‌లో పెట్టుబడి పెట్టేవారితో పాటు, పాలసీదారుల్లో కూడా ఐపీఓలో పాల్గొనాలనే ఉత్సాహం పెరిగింది. మరి ఐపీఓలో పాల్గొనాలంటే ఏం చేయాలి.. ఏమేం కావాలి.

* ముందుగా పాలసీ అకౌంట్‌తో పాన్ కార్డ్‌ని లింక్ చేయాలి. ఎల్‌ఐసీ రికార్డుల్లో పాన్ అప్‌డేట్ అయితేనే ఐపీఓలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

* https://licindia.in/home/online PAN Registration లింక్‌ పైన క్లిక్ చేసి వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

అక్కడ పాలసీ నెంబర్, పుట్టిన తేదీ, పాన్ వివరాలు నమోదు చేయాలి.

క్యాప్చా కోడ్ క్లిక్ చేసి తర్వాత సబ్‌మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ పాలసీకి, పాన్ లింక్ అయ్యందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి.

డీమ్యాట్ ఖాతా లేకపోతే కొత్తగా తెరవాల్సి ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లో షేర్లు కొనాలన్నా, అమ్మాలన్నా డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. దానిక్కూడా ఆధార్, పాన్, అడ్రస్ వంటి వివరాలతో డీమ్యాట్ ఖాతాను తెరవచ్చు. అప్పుడే ఐపీఓలో పాల్గొనడానికి అర్హత సాధించొచ్చు.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య ఎక్కువైంది గత కొన్నేళ్లుగా. కోవిడ్ వేళ ఈ సంఖ్య మరింత ఎక్కువైంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు యువత ఆసక్తి చూపుతోంది. ఇప్పుడు ఎల్‌ఐసీ ఐపీఓకు వస్తుండడంతో ఇదివరకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు ఇందులో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు సన్నద్దమవుతున్నారు. 10 శాతం షేర్లు పాలసీ దారులకు కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో ఐపీఓలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు పాలసీదారులు. దీంతో డీమ్యాట్ ఖాతా సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story