ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. స్టోర్‌ ఉద్యోగులను చితకబాదిన కస్టమర్లు

ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. స్టోర్‌ ఉద్యోగులను చితకబాదిన కస్టమర్లు
ఇదేం పిచ్చిరా నాయినా.. ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిందో లేదో వెంటనే వాళ్ల చేతుల్లోకి వచ్చేయాలనుకుంటారు.

ఇదేం పిచ్చిరా నాయినా.. ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిందో లేదో వెంటనే వాళ్ల చేతుల్లోకి వచ్చేయాలనుకుంటారు. కాస్త ఆలస్యమైతే తమ ప్రస్టేజికి ఏదో భంగం వాటిల్లినట్లు ఫీలైపోతున్నారు.

స్టోర్‌లోని 10 మందికి పైగా సిబ్బంది జోక్యం చేసుకుని, కోపంతో ఉన్న వ్యక్తులు తమ సహోద్యోగులను కొట్టకుండా ఆపడానికి ప్రయత్నించారు, కానీ ఫలితం లేకుండా పోయింది.

శుక్రవారం అమ్మకాలు ప్రారంభమైనప్పటి నుండి సరికొత్త ఐఫోన్‌ను పొందేందుకు క్యూలో నిల్చున్న Apple అభిమానులకు నిరాశ ఎదురైంది. ఐఫోన్ 'క్రేజ్' వల్ల 17 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా లైనులో నిలబడటానికి ఇబ్బంది పడలేదు.

తమ ఐఫోన్ 15ల డెలివరీ ఆలస్యం అవుతుందని చెప్పడంతో, ఢిల్లీలోని ఇద్దరు కస్టమర్‌లు స్టోర్‌లోని సిబ్బందిని కొట్టడం మొదలు పెట్టారు. స్టోర్ సిబ్బంది మొత్తం వారిని వారించిన ఆగలేదు.. సరికదా మరింత ఎక్కువ చేశారు.

ఉత్తర ఢిల్లీలోని కమలా నగర్ మార్కెట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ల కింద కస్టమర్లిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని భారతదేశపు మొట్టమొదటి ఆపిల్ స్టోర్ నుండి కొత్త ఐఫోన్, యాపిల్ వాచ్ మరియు ఎయిర్‌పాడ్స్ లైనప్ నుండి వస్తువులను కొనుగోలు చేసిన వారిలో అహ్మదాబాద్ మరియు బెంగళూరు వంటి ప్రాంతాల నుండి ముంబయికి వచ్చిన కస్టమర్లు ఉన్నారని శుక్రవారం వార్తలు వచ్చాయి.

"నేను గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఇక్కడే ఉన్నాను. భారతదేశపు మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌లో మొదటి ఐఫోన్‌ను పొందడానికి నేను 17 గంటల పాటు క్యూలో వేచి ఉన్నాను. నేను అహ్మదాబాద్ నుండి వచ్చాను" అని ఒక కస్టమర్ జాతీయ మీడియాకు తెలిపారు. బెంగళూరుకు చెందిన మరో కస్టమర్ వివేక్, "నేను నా కొత్త ఐఫోన్ 15 ప్రోని పొందుతున్నందుకు సంతోషంగా ఉంది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను." అని తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story