ముంబైలో మళ్లీ ఏడాదినాటి రోజులు..! సగానికి సగం పడిపోయిన వ్యాపారం

ముంబైలో మళ్లీ ఏడాదినాటి రోజులు..! సగానికి సగం పడిపోయిన వ్యాపారం
వ్యాపారం సగానికి సగం తగ్గిపోయిందని యజమానులు వాపోతున్నారు. సరిగ్గా, ఏడాది క్రితం పరిస్థితిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

కరోనా సెకండ్ వేవ్‌తో దేశ ఆర్థిక రాజధాని ముంబై అల్లాడిపోతోంది. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, హోటల్స్‌పై ఈ దెబ్బ భారీగా పడింది. దీంతో వ్యాపారం సగానికి సగం తగ్గిపోయిందని యజమానులు వాపోతున్నారు. సరిగ్గా, ఏడాది క్రితం ఇలానే లాక్‌డౌన్‌తో అన్నీ స్తంభించిపోయిన పరిస్థితిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు సగమైనా తెరిచినందుకు సంతోషించాలో,లేక రాబోయే రోజుల్లో పూర్తిగా తాళం వేయమంటారో అనే భయంతో ఆందోళన చెందుతున్నారు.

నైట్ కర్ఫ్యూ అమలు అయి ఐదు రోజులు కావడంతో హోటల్, రెస్టారెంట్ ఓనర్ల మాటేమిటంటే, రాత్రి 8 నుంచి షాపులు మూయమంటే ఓ రకంగా మొత్తం మూసేయమని చెప్పినట్లేనంటూ వాపోతున్నారు. ఎందుకంటే పగలు బిజినెస్ కంటే ముంబైలో ఈవెనింగ్ టైమ్ నుంచి నడిచే వ్యాపారమే ఎక్కువ. ఆంక్షలకు తోడుగా, జనం కూడా బైటికి రావడానికి ఇష్టపడటం లేదు. అవసరమైన వాటి కోసం మాత్రం రద్దీగా ఉన్న ఏరియాలకైనా వెళ్తున్నారు కానీ, ఇలా మాల్స్, రెస్టారెంట్ల వైపు మాత్రం సగంమంది వెళ్లడం లేదట

ఏప్రిల్ 15 వరకూ నైట్ కర్ప్యూ అమలవుతుందని ప్రస్తుతానికి ఆదేశాలు ఉన్నా..ఇంకా పొడిగించే సూచనలే ఉన్నాయ్. శానిటైజేషన్ మాస్క్ , రాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ వంటి రక్షణ మార్గాలు ఫాలో అవడానికి తాము సిద్ధంగానే ఉన్నా..ప్రభుత్వం విధించిన ఆంక్షలు తమ చేతులు కట్టిపడేస్తున్నాయన్నది కొంతమంది పెద్ద పెద్ద రెస్టారెంట్స్ మాల్ యజమానుల వాదన. ఐతే ఇలా కొన్ని మాత్రమే నిబంధనలు అమలు చేస్తుండగా, కొన్ని గాలికి వదిలేస్తున్నాయని, అందుకే ఆంక్షలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిక.

వాస్తవానికి ముంబైలో గత అక్టోబర్ 20 నుంచి మాత్రమే హోటల్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేసారు. అది కూడా 50శాతం ఆక్యుపెన్సీ నిబంధనతో ఇప్పుడు ఐదు నెలలు పూర్తై, పూర్తి కాలేదో వెంటనే మరోసారి కరోనా పడగ నీడ పడటంతో వ్యాపారాలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలోనే అసలు గత ఏడాది లాక్‌డౌన్ దెబ్బకే 30శాతం హోటల్స్, రెస్టారెంట్స్ తిరిగి తెరుచుకోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మరోసారి దెబ్బ పడితే, సగం వ్యాపారాలు శాశ్వతంగా మూతబడతాయని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మహారాష్ట్ర గవర్నమెంట్‌కి ఓ విజ్ఞప్తి చేసింది. రిస్ట్రిక్షన్స్ కాస్తైనా సడలించాలంటూ విన్నవించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story