Onions : ఉల్లిగడ్డల స్మగ్లింగ్.. కోట్లలో ఆదాయం

Onions : ఉల్లిగడ్డల స్మగ్లింగ్.. కోట్లలో ఆదాయం

"ఉల్లి (Onions) చేసిన మేలు తల్లి కూడా చేయద"ని అంటుంటారు.. అదే సామెతను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో.. కొందరు ఉల్లిగడ్డల స్మగ్లింగ్ కి పాల్పడుతున్నారు. మన దేశంలో అయితే ప్రస్తుతం కిలో ఉల్లికి రూ.20-30 ఉంది. కానీ ఇతర దేశాల్లో మాత్రం ఆదే కిలో ఉల్లిగడ్డకు వెయ్యి రూపాయలు పలుకుతోంది. ఇదే అదనుగా చేసుకున్న కొందరు ఉల్లిని స్మగ్లింగ్ చేయడం ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే...

చెన్నై, ముంబై, బీహార్‌ నుంచి బంగ్లాదేశ్‌, దుబాయ్‌, శ్రీలంక తదితర దేశాలకు ఉల్లిగడ్డల స్మగ్లింగ్‌ జరుగుతున్నట్టు సమాచారం. భారత్‌లో మినహా ఇతర దేశాల్లో కిలో ఉల్లిగడ్డ వెయ్యి రూపాయలు పైనే ఉండటంతో స్మగ్లర్లు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలా రోజూ ఉల్లిని అక్రమంగా తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు స్మగ్లర్లు.

క్వింటాలుకు రూ.1000 చొప్పున ఉల్లిని కొనుగోలు చేసి.. విదేశాలకు మాత్రం అంతే విలువ గా ఉల్లిని రూ.9-10 వేల వరకు విక్రయిస్తూ కోట్లు వసూలు చేస్తున్నారు. దేశం నుంచి రోజూ 10-12 కంటైనర్లలో 300 టన్నుల ఉల్లి అక్రమ రవాణా అవుతుండగా... ఈ రాకెట్‌లో కొందరు కస్టమ్స్‌ అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఉల్లిగడ్డల ఎగుమతుల లావాదేవీలన్నీ హవాలా మార్గంలో జరుగుతున్నట్లు సమాచారం. నాసిక్‌లోని మాలేగావ్‌, ముంగ్సే, లాసల్‌ గావ్‌, పింపాల్‌ గావ్‌ల నుంచి ఈ రాకెట్‌ను నడుపుతున్నట్లు ప్రాథమిక సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story