Tanishq Stores: తనిష్క్ స్టోర్స్ పున:ప్రారంభం.. ప్రతి కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం
Tanishq: టాటా గ్రూప్‌నకు చెందిన.. దేశంలో అతిపెద్ద ఆభరణాల వాణిజ్య బ్రాండ్ తనిష్క్.. హైదరాబాద్‌లో తమ రెండు స్టోర్స్‌ను పునఃప్రారంభించింది. ఈ రెండు స్టోర్లను టైటాన్ కంపెనీ లిమిటెడ్ సౌత్ రీజినల్ బిజినెస్ హెడ్ శరద్.ఆర్, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు.
జూబ్లీహిల్స్, కొండాపూర్‌లో స్టోర్స్‌ను పునఃప్రారంభించి తమ వాణిజ్య కార్యకలాపాలను విస్తరించింది తనిష్క్. ఈ సందర్భంగా తనిష్క్ ప్రతి కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం అందిస్తుంది. ఆఫర్ ఈనెల 6వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
3వేలకు పైగా డిజైన్‌లు ఉన్నాయని.. వివాహ కలెక్షన్స్ కోసం ఇక్కడ ప్రత్యేక జోన్ ఉందన్నారు. తనిష్క్‌కు చెందిన ఉప బ్రాండ్ రివా కలెక్షన్ నుంచి అత్యద్భుతమైన ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు. రెండు స్టోర్లను పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని శరద్.ఆర్ తెలిపారు. నగరంలో 13 స్టోర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీవీ5 ఎండీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com