సినిమా

కృష్ణ స్టార్ డమ్.. ఒకే ఏడాదిలో 8 సినిమాలు రిలీజ్.. 6 సూపర్ హిట్స్.. అవేంటో తెలుసా!!

ప్రయోగాలు చేయడంలో కృష్ణ తర్వాతే ఎవరైనా. హాలీవుడ్ తరహాలో సినిమా తీయాలని కలలు కన్నారు. ఎవరెంత నిరుత్సాహ

కృష్ణ స్టార్ డమ్.. ఒకే ఏడాదిలో 8 సినిమాలు రిలీజ్.. 6 సూపర్ హిట్స్.. అవేంటో తెలుసా!!
X

ప్రయోగాలు చేయడంలో కృష్ణ తర్వాతే ఎవరైనా. హాలీవుడ్ తరహాలో సినిమా తీయాలని కలలు కన్నారు. ఎవరెంత నిరుత్సాహ పరిచినా ధైర్యంగా ముందడుగు వేశారు అనుకున్నది సాధించారు. ఇంగ్లీషులో వచ్చిన కౌ బాయ్ చిత్రాన్ని రీమేక్ చేసి తెలుగు ఆడియన్స్ కోసం మరికొన్ని హంగులద్ది తీసిన చిత్రం మోసగాళ్లకు మోసగాడు సూపర్ హిట్టయింది.

టాలీవుడ్‌లో ఎన్నో సాంకేతిక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా కృష్ణకు మంచి పేరు. ఆయన కెరీర్‌లో అత్యంత కీలకమైన సంవత్సరం 1985. ఆ ఏడాదిలో ఆయన సినిమాలే ఏకంగా ఎనిమిది రిలీజ్ అయ్యాయి. అందులో ఆరు సూపర్ సక్సెస్‌ని తెచ్చిపెట్టాయి.

1985 జనవరి 11న రిలీజైన అగ్నిపర్వతం సూపర్ హిట్‌తో మొదలైంది ఆ ఏడాది. ఈ చిత్రంలో కృష్ణ డబుల్ యాక్షన్. కె. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో రాధ, విజయశాంతి హీరోయిన్లు.

ఆ తర్వాత పల్నాటి సింమం. అది కూడా పెద్ద హిట్. ఏ. కోదండరామిరెడ్డి డైరక్షన్‌లో రాధ, జయసుధ హీరోయిన్స్. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో మరో హిట్ వజ్రాయుధం.. శ్రీదేవి గ్లామర్ ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. కమర్సియల్‌గా మరో విజయం అందుకున్న చిత్రం సూర్య చంద్ర. విజయనిర్మల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో జయప్రద, రాధ హీరోయిన్స్.

అదే ఏడాది శోభన్ బాబుతో కలిసి నటించిన చిత్రం మహాసంగ్రామం రిలీజైంది. అది కాస్త నిరాశపరిచినా కలెక్షన్ల పరంగా మంచి టాక్ అందుకుంది. ఈ చిత్రంలో జయప్రద, జయసుధ హీరోయిన్స్. అదే ఏడాది వచ్చిన అందరికంటే మొనగాడు, మహా మనిషి కూడా నిరాశ పరిచాయి. ఇదే ఏడాది రిలీజైన పచ్చని కాపురం.. కృష్ణ, శ్రీదేవి నటన మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాతినేని రామారావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది.

Next Story

RELATED STORIES