సినిమా

Radhe Shyam Release Date: 'రాధే శ్యామ్‌'కు పోటీగా మెగా హీరో సినిమా..

Radhe Shyam Release Date: సంక్రాంతి అంటే టాలీవుడ్‌కు సినిమా పండగ లాంటిదే. అందుకే విడుదల కోసం సినిమాలు పోటీ పడుతుంటాయి.

Radhe Shyam Release Date: రాధే శ్యామ్‌కు పోటీగా మెగా హీరో సినిమా..
X

Radhe Shyam Release Date: సంక్రాంతి అంటే టాలీవుడ్‌కు సినిమా పండగ లాంటిదే. ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాయి. అందుకే సంక్రాంతి విడుదల కోసం చాలా సినిమాలు పోటీ పడుతుంటాయి. కానీ ఈసారి సంక్రాంతికి థియేటర్లలో సందడి మిస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా కూడా కొన్ని సినిమాలు ధైర్యంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ముందుగా 2022 సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్', 'భీమ్లా నాయక్' విడుదలను ఖరారు చేసుకున్నాయి. కానీ మూడు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలయితే.. నిర్మాతలకు నష్టం తప్పదు. కానీ సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడానికి ఇందులో ఏ ఒక్క సినిమా కూడా సిద్ధంగా లేదు. అయినా కూడా భీమ్లా నాయక్ టీమ్‌ను ఒప్పించి విడుదలను వాయిదా చేయించారు నిర్మాతలు.

ఇక సంక్రాంతి పోటీలో మిగిలిన రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో ఒమిక్రాన్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్ఆర్ఆర్ కూడా విడుదలను పోస్ట్ చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీంతో రాధే శ్యామ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ముందు అనుకున్నదానికంటే ఎక్కువ స్క్రీన్స్‌లోనే సినిమా విడుదలకు ప్లాన్ ఏర్పాటయ్యింది. ఇంతలోనే రెండు సినిమాలు ధైర్యంగా రాధే శ్యామ్‌తో పోటీకి దిగనున్నాయి. అందులో ఒక మెగా హీరో సినిమా కూడా ఉంది.

భీమ్లా నాయక్‌ను నిర్మించిన సూర్యదేవర నాగవంశీ నిర్మించిన మరో తక్కువ బడ్జెట్ చిత్రం 'డీజే టిల్లు'. తనకు ఇష్టం లేకపోయినా.. భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి రేసు నుండి తప్పించడంతో డీజే టిల్లును సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నాడు నాగవంశీ. ఇక 'విజేత' చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. ఇప్పుడు తన రెండో సినిమా 'సూపర్ మచ్చి'తో సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో రాధే శ్యామ్‌కు పోటీగా దిగుతున్నాడు.Next Story

RELATED STORIES