టాలీవుడ్ లో పెళ్లి సందడి.. అభిరామ్ డెస్టినేషన్ వెడ్డింగ్

టాలీవుడ్ లో పెళ్లి సందడి.. అభిరామ్ డెస్టినేషన్ వెడ్డింగ్
నటీమణులు నలభైకి చేరువవుతున్నా పెళ్లి మాట ఎత్తితే ఇంకా టైమ్ ఉంది అంటూ ఆ మాట దాటవేస్తున్నారు.. కానీ టాలీవుడ్ లో కుర్ర హీరోలు సైతం పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు..

నటీమణులు నలభైకి చేరువవుతున్నా పెళ్లి మాట ఎత్తితే ఇంకా టైమ్ ఉంది అంటూ ఆ మాట దాటవేస్తున్నారు.. కానీ టాలీవుడ్ లో కుర్ర హీరోలు సైతం పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు.. ఏ వయసుకి ఆ ముచ్చటే బాగుంటుంది అని నచ్చిన అమ్మాయి దొరికితే మూడు ముళ్లు వేసి ముచ్చట తీర్చుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు అభిరామ్ పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. శ్రీలంక వేదికగా ఈ పెళ్లి జరగనుంది.

కొన్ని నెలల క్రితం అభిరామ్ నిశ్చితార్థం గురించి వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ఈవెంట్ మూడు రోజుల పాటు సంప్రదాయ ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాలతో ప్లాన్ చేయబడినట్లు సమాచారం. ఖరీదైన రిసార్ట్‌లో పెళ్లి జరగనుందని, ఈ వేడుకకు 200 మంది సభ్యులను మాత్రమే ఆహ్వానిస్తున్నారని సమాచారం. ఇప్పటికే శ్రీలంకలోని వివాహ వేదికకు కుటుంబ సభ్యులు చేరుకున్నట్లు తెలుస్తోంది.

లెజెండరీ మూవీ మొగల్, దివంగత డి రామానాయుడు స్వస్థలమైన ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన ప్రత్యూష అనే సినిమా నేపథ్యం లేని అమ్మాయితో అభిరామ్ వివాహం జరగనుంది. అభిరామ్, దర్శకుడు తేజ 'అహింస'తో హీరోగా పరిచయం అయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story